
రోడ్డు ప్రమాదంలో విజయవాడ ట్రాఫిక్ డీసీపీ షరీన్ బేగం కుమార్తె ఎండీ అఫిఫా మృతి చెందడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతికి గురయ్యారు. అమరావతి, ఆగస్టు 10: రోడ్డు ప్రమాదంలో విజయవాడ ట్రాఫిక్ డీసీపీ షరీన్ బేగం కుమార్తె ఎండీ అఫిఫా మృతి చెందడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతికి గురయ్యారు. సోషల్ మీడియా ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. ఎంతో భవిష్యత్తు ఉన్న అఫిఫా.. 24 ఏళ్ల చిన్న వయస్సులో రోడ్డు ప్రమాదం బారిన పడి అందరికీ దూరమవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఎండీ అఫిఫా ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఆమె కుటుంబ సభ్యులకు సీఎం చంద్రబాబు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. షరీన్ బేగం, కుటుంబ సభ్యులకు భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నానని ఎక్స్‌లో సీఎం చంద్రబాబు పోస్ట్ చేశారు. అఫిఫా మృతి తీవ్రంగా కలిచివేసింది: హోం మంత్రి అనిత విజయవాడ ట్రాఫిక్ డీసీపీ షరీన్ బేగం కుమార్తె అఫిఫా రోడ్డు ప్రమాదంలో మృతిపై హోం మంత్రి వంగలపూడి అనిత విచారం వ్యక్తం చేశారు. ఎంతో భవిష్యత్తు ఉన్నా.. 24 ఏళ్ల వయసులోనే నిండు జీవితాన్ని కోల్పోవడం బాధాకరమన్నారు. అఫిఫా మృతి తీవ్రంగా కలచివేసిందని ఆవేదన చెందారు. విషాద సమయంలో అఫిఫా కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ దుఃఖాన్ని తట్టుకునే మనోధైర్యాన్ని కుటుంబ సభ్యులకు ప్రసాదించాలని కోరుకున్నారు. అఫిఫా ఆత్మకు శాంతి చేకూరాలని హోం మంత్రి అనిత ప్రార్థించారు. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ట్రాఫిక్ డీసీపీ షరీన్ బేగం కుమార్తె అఫిఫా భౌతికకాయానికి ఏపీ డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా నివాళులర్పించారు. అజిత్ సింగ్ నగర్‌కు చేరుకున్న డీజీపీ, సీపీ.. అఫిఫాకు నివాళులర్పించి, షరీన్ బేగంను ఓదార్చి ధైర్యం చెప్పారు. నిన్న(ఆదివారం) స్నేహితులతో కలిసి సరదాగా గడుపుదామని కారులో చీరాల బీచ్‌కు బయలుదేరిన అఫిఫా రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. గుంటూరు జిల్లా ఏటుకూరు సమీపంలో జాతీయ