
సర్గం రవి కుమార్. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Team India: టీ20 ప్రపంచ చాంపియన్ భారత జట్టుకు మరో భంగపాటు ఎదురైంది. ఐర్లాండ్ సిరీస్‌లో వైట్‌వాష్‌కు గురయిన టీమిండియా ఇంగ్లాండ్ చేతిలో కూడా అదే పరిస్థితి ఎదుర్కొంటోంది. నాలుగో టీ20 మ్యాచ్‌లో కూడా ఓడిపోయిన భారత జట్టు వరుసగా మూడో ఓటమిని చవిచూసింది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 3-0తో ఇంగ్లాండ్ టీ20 సిరీస్‌ను సొంతం చేసుకుంది. సొంత గడ్డపై జరుగుతున్న సిరీస్‌లో ఇంగ్లండ్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టి ఆతిథ్య టీమిండియాను వైట్‌వాష్ చేయాలని చూస్తోంది. శ్రేయస్ అయ్యర్ నాయ కత్వంలో బరిలో దిగిన టీమిండియా నాలుగో మ్యాచ్‌లో ఇంగ్లండ్ 9 వికెట్ల తేడాతో భారీ విజయం సాధించింది. భారత్ జట్టు నిర్దేశించిన 159 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లండ్ 13.5 ఓవర్లలో ఒక వికెట్ మాత్రమే కోల్పోయి ఛేదించింది. కెప్టెన్ హ్యారీ బ్రూక్, ఫిల్ సాల్ట్ చెలరేగి ఆడడంతో ఇంగ్లండ్ సిరీస్‌ను సొంతం చేసుకుంది. 35 బంతుల్లో 79 పరుగులు చేసిన బ్రూక్ నాటౌట్‌గా నిలవగా.. 8 ఫోర్లు, 4 సిక్సర్లు బాదాడు. చక్కటి సహకారం అందిస్తూ ఫిల్ సాల్ట్ 59 పరుగులు చేసి అజేయంగా మ్యాచ్‌ను ముగించాడు. 39 బంతులు మిగిలుండగానే ఆట ముగియడం విశేషం. తక్కువ లక్ష్యాన్ని కాపాడడంలో భారత బౌలర్లు విఫలమయ్యారు. ఏమాత్రం ప్రత్యర్థిని ఇరుకునపెట్టేలా బౌలింగ్ చేయలేకపోయారు. అర్ష్‌దీప్ సింగ్ తీసిన ఒక్క వికెట్ తప్ప మిగిలిన బౌలర్లు తమలోని శక్తిని బయటకు తీయలేదు. దీంతో మరో మ్యాచ్ మిగిలుండగానే ఐదు టీ20 సిరీస్‌ను 3-0తో ఇంగ్లండ్ తన ఖాతాలో వేసుకుంది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టు అతి తక్కువ స్కోర్