
రుత్విక్, విశాఖ ధిమాన్ జంటగా నటించిన 'రాజా ది రాజా' చిత్రం ఈ నెల 17న విడుదల కాబోతోంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను చిత్ర బృందం విడుదల చేసింది. రుత్విక్, విశాఖ ధిమాన్ జంటగా నటించిన చిత్రం 'రాజా ది రాజా'. అనిల్ బోయిడపు దర్శకత్వంలో కె. నిహారిక దాసరి నిర్మించిన ఈ చిత్రాన్ని కె. శ్రీలత రెడ్డి సమర్పిస్తున్నారు. జూలై 17న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ఈ చిత్రాన్ని రెండు తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేయబోతున్నారు. 'రాజా ది రాజా' చిత్రం ట్రైలర్ ను సోమవారం హైదరాబాద్‌లో మూవీ ట్రైలర్ ను విడుదల చేశారు. ఈ సందర్భంగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాత రవిశంకర్ మాట్లాడుతూ, 'ఈ మధ్యకాలంలో ఈ సినిమా పేరు ఎక్కువగా వినిపించింది. ఈ సినిమా హీరో రుత్విక్ తో పాటు నిర్మాత నిహారిక కూడా చాలా ప్యాషన్ ఉన్న నిర్మాత. పాటలు అద్భుతంగా ఉన్నాయి. ఒక పెద్ద సినిమాలోని విజువల్స్‌లా అనిపిస్తున్నాయి. డైరెక్టర్ అనిల్ చాలా అద్భుతంగా మూవీ తీశాడు. హీరో రుత్విక్ కు మంచి భవిష్యత్తు ఉంది. రొమాన్స్, కామెడీ చేయడం చాలా కష్టం. చాలా టాలెంట్ ఉంటే గానీ ఆ ఎక్స్‌ప్రెషన్స్ రావు. ట్రైలర్‌లో చూస్తుంటే తనలో చాలా ఈజ్ కనిపించింది. నిహారిక క్వాలిటీ విషయంలో ఎక్కడా రాజీపడలేదు. ట్రైలర్ చూసిన తర్వాత టీమ్ అంతా చాలా మంచి సినిమా చేశారనే ఫీలింగ్ కలిగింది' అని అన్నారు. హీరో రుత్విక్ మాట్లాడుతూ, 'ఈ సినిమాతో నేను నటుడిగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం కాబోతున్నాను. ఈ జర్నీ చాలా ఎమోషనల్. అనిల్‌తో కలిసి సినిమా చేయడం చాలా అద్భుతమైన అనుభూతి. ప్రేక్షకులను అలరించేలా ప్రతి సన్నివేశాన్ని తెరకెక్కించడానికి మేమంతా చాలా కష్టపడ్డాం. ప్రతి బ్రదర్‌కు నిహారిక లాంటి సిస్టర్ ఉండాలి. తనే నా బలం. నాకు సపోర్ట్