Tax Notice: పన్ను మినహాయింపు పరిమితి దాటి ఆదాయం ఉన్నప్పుడు ట్యాక్స్ కట్టాలి. ఉద్యోగం చేస్తున్న వారిలో చాలా మంది వేతనాలపై ట్యాక్స్ పడుతుంది. అయితే, ఉద్యోగ విరమణ (Retirement) పొందిన తర్వాత నెల నెలా వచ్చే జీతం ఆగిపోతుంది కాబట్టి పన్ను పరిధిలోకి రాము అని చాలా మంది సీనియర్ సిటిజన్లు అనుకుంటారు. కానీ, అది పొరపాటు! రిటైర్మెంట్ అనేది పన్ను బాధ్యతల నుంచి పూర్తిగా విముక్తిని ఇవ్వదు. ఆదాయపు పన్ను చట్టం 1961 ప్రకారం ఉద్యోగం ఆగిపోయినా మీరు పొందే పెన్షన్, పొదుపుపై వచ్చే వడ్డీ, అద్దెలు, ఇతర పెట్టుబడుల ద్వారా వచ్చే రాబడి ఆధారంగా పన్ను కట్టాల్సి ఉంటుంది. పన్ను వర్తించే ఆ 7 ప్రధాన ఆదాయ మార్గాలు, మినహాయింపు లభించే అంశాల వివరాలు తెలుసుకుందాం.రిటైర్మెంట్ తర్వాత కూడా పన్ను పడే 7 ఆదాయాలు నెల నెలా వచ్చే పెన్షన్: నెల నెలా వచ్చే పెన్షన్ ఆదాయాన్ని శాలరీ కిందే పరిగనిస్తారు.ఎంచుకున్న పన్ను విధానం (Tax Regime) ఆధారంగా స్టాండర్డ్ డిడక్షన్ ప్రయోజనం వర్తిస్తుంది. ఆ తర్వాత మిగిలి ఉన్న ఆదాయంపై ట్యాక్స్ కట్టాల్సి రావచ్చు. బ్యాంక్ ఎఫ్‌డీ, సేవింగ్స్ వడ్డీ: బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లు, రికరింగ్ డిపాజిట్లు (Recurring Deposit), సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ వంటి పోస్టాఫీస్ డిపాజిట్లపై వచ్చే వడ్డీకి పన్ను పడుతుంది. పాత పన్ను విధానంలో సెక్షన్ 80టీటీబీ కింద రూ.50 వేల వరకు డిడక్షన్ పొందవచ్చు. ఇంటి అద్దె ఆదాయం: ఇల్లు లేదా కమర్షియల్ ప్రాపర్టీల ద్వారా వచ్చే అద్దె (Rental Income)పై 30 శాతం స్టాండర్డ్ డిడక్షన్ తీసివేసిన తర్వాత మిగిలిన మొత్తానికి పన్ను వర్తిస్తుందని గుర్తుంచుకోవాలి. క్యాపిటల్ గెయిన్స్: మ్యూచువల్ ఫండ్స్, షేర్లు లేదా స్థలాలు, ఇళ్లు అమ్మడం ద్వారా వచ్చే లాభాలు (Capital Gains)పై LTCG/STCG నిబంధనల ప్రకారం పన్ను చెల్లించాలి. డివిడెండ్లు, ఇన్సూరెన్స్ యాన్యుటీ: షేర్ల డివిడెండ్
Actor ProfilePolitician
రిటైర్మెంట్ తర్వాత జీతం రాకున్నా.. ఈ 7 ఆదాయాల
📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
Samayam Telugu•15 Dec 2026
రిటైర్మెంట్ తర్వాత జీతం రాకున్నా.. ఈ 7 ఆదాయాలపై ట్యాక్స్ పడొచ్చు.. ఓసారి చూసుకోండి