రోజుల్లో సినిమా.. ఏడు అవార్డులు.. ఓటీటీలోకి వస్తున్న సంజీవ్
Actor ProfileActor

రోజుల్లో సినిమా.. ఏడు అవార్డులు.. ఓటీటీలోకి వస్తున్న సంజీవ్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
రోజుల్లో సినిమా.. ఏడు అవార్డులు.. ఓటీటీలోకి వస్తున్న సంజీవ్
NTV Telugu20 Nov 2026
రోజుల్లో సినిమా.. ఏడు అవార్డులు.. ఓటీటీలోకి వస్తున్న సంజీవ్

Sanjeev OTT Release: తెలుగు ఇండిపెండెంట్ సినిమా ‘సంజీవ్’ ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. కథకు ప్రాధాన్యతనిస్తూ పరిమిత బడ్జెట్‌లో రూపొందిన ఈ డ్రామా చిత్రం ఇప్పటికే పలు జాతీయ, అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల్లో ప్రదర్శితమై మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పటివరకు ఏడు అవార్డులను సొంతం చేసుకున్న ‘సంజీవ్’ త్వరలో ప్రముఖ తెలుగు ఓటీటీ వేదిక ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. ‘సంజీవ్’ ఓటీటీ విడుదలకు సంబంధించిన అధికారిక ప్రకటనను ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల ఆవిష్కరించనున్నారు. దీంతో ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో గుర్తింపు పొందిన ఈ చిన్న బడ్జెట్ చిత్రం ఇప్పుడు ఓటీటీ ద్వారా మరింత విస్తృతమైన తెలుగు ప్రేక్షకులకు చేరువ కానుంది. పరిమిత బడ్జెట్‌తో.. బలమైన కథతో వీబీ సినిమా బ్యానర్‌పై అనిల్ నక్క రచన, దర్శకత్వం, నిర్మాణ బాధ్యతలు చేపట్టారు. పెద్ద నిర్మాణ సంస్థల అండ లేకపోయినా.. బలమైన కథ, సహజమైన కథనం, నటీనటుల ప్రతిభపై నమ్మకంతో ఈ చిత్రాన్ని రూపొందించారు. సుమారు 70 నిమిషాల నిడివితో తెరకెక్కిన ‘సంజీవ్’ను కేవలం నాలుగు రోజుల్లోనే పూర్తి చేయడం విశేషం. పరిమిత వనరులు, తక్కువ బడ్జెట్ ఉన్నప్పటికీ కథపై నమ్మకంతో టీమ్ మొత్తం కలిసి పనిచేసి సినిమాను పూర్తి చేసింది. థియేటర్, షార్ట్ ఫిల్మ్స్, ఇండిపెండెంట్ ఫిల్మ్ మేకింగ్ నేపథ్యం ఉన్న పలువురు యువకులు ఈ ప్రాజెక్ట్ కోసం ఒక్కటయ్యారు. తమ సొంత సినిమాను రూపొందించాలనే లక్ష్యంతో ఏర్పడిన టీమ్ APPAHకు ‘సంజీవ్’ ఒక ముఖ్యమైన ప్రాజెక్ట్‌గా నిలిచింది. నాలుగు రోజుల్లోనే సినిమా పూర్తి ‘సంజీవ్’ నిర్మాణ ప్రయాణంలో నాలుగు రోజుల్లో షూటింగ్ పూర్తి చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. అందుబాటులో ఉన్న వనరులను సమర్థంగా వినియోగించుకుంటూ, ఒకే లక్ష్యంతో టీమ్ పనిచేయడంతో ఇది సాధ్యమైందని చిత్రబృందం చెబుతోంది. సినిమాలో వీర మనోహర్, హరీష్ పాలకుర్తి, అచ్యుత్, లయ మిరియాల, అనిల్ నక్క తదితరులు కీలక పాత్రల్లో నటించారు. థియేటర్ నుంచి సినిమా వైపు

ర జ ల ల స న మ ఏడ అవ ర డ ల ఓట ట ల క వస త న న స జ వ Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in