రోజుల్లో నాగబంధం మూవీ వసూలు చేసింది ఇంతేనా.. షాకింగ్ కలెక్షన్లు
Actor ProfileActor

రోజుల్లో నాగబంధం మూవీ వసూలు చేసింది ఇంతేనా.. షాకింగ్ కలెక్షన్లు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
రోజుల్లో నాగబంధం మూవీ వసూలు చేసింది ఇంతేనా.. షాకింగ్ కలెక్షన్లు
Asianet News Telugu25 Sept 2026
రోజుల్లో నాగబంధం మూవీ వసూలు చేసింది ఇంతేనా.. షాకింగ్ కలెక్షన్లు

`పెదకాపు` తర్వాత విరాట్‌ కర్ణ నటించిన చిత్రం `నాగబంధం`. ఇది నభా నటేష్‌, ఐశ్వర్య మీనన్‌, అనసూయ, మురళీ శర్మ, జగపతిబాబు, రిషబ్‌ సాన్వీ వంటి భారీ కాస్టింగ్‌తో రూపొందింది. హీరో ఇమేజ్‌కి మించిన బడ్జెట్‌తో రూపొందించారు. దీనికి సుమారు వంద కోట్ల బడ్జెట్‌ అయ్యిందని సమాచారం. కొత్త హీరోపై ఈ స్థాయి బడ్జెట్‌ అంటే చాలా కష్టం. అయితే బిజినెస్‌ కూడా గట్టిగానే చేసింది. నాన్‌ థియేట్రికల్‌ రైట్స్ రూపంలోనే సుమారు రూ.80కోట్లు వచ్చినట్టు సమాచారం. ఈ లెక్కన నిర్మాతకు మరో ఇరవై కోట్లు వస్తే సేఫ్‌లో ఉంటాడు. భారీ అంచనాల మధ్య విడుదలైన `నాగబంధం` మూవీకి మొదటి రోజు నుంచే నెగటివ్‌ టాక్‌ వచ్చింది. విజువల్స్ గా బాగున్నా, కథ పరంగా తేలిపోయిందని, టేకింగ్‌ పరంగా ఆకట్టుకునేలా లేదనే టాక్‌ వచ్చింది. యాక్షన్‌ ఉందిగానీ, ఎమోషన్స్ మిస్‌ అయ్యాయి. దీంతో ఆడియెన్స్ సినిమాకి కనెక్ట్ కాలేకపోయారు. ఆ ప్రభావం ఇప్పుడు కలెక్షన్లపై పడుతుంది. దీనికి పూర్‌ కలెక్షన్లు వస్తుండటం గమనార్హం. మూడు రోజులో ఈ మూవీ రూ.12.90కోట్లు వసూలు చేసింది. మొదటి రోజు ఈ సినిమాకి రూ.3.40కోట్లు వస్తే, రెండో రోజు మూడు కోట్లు మాత్రమే వచ్చాయి. మూడో రోజు రూ.3.65కోట్ల నెట్‌ని రాబట్టింది. ఇలా ఇప్పటి వరకు ఇండియాలో రూ.10.10కోట్లు వసూలు చేయగా, రూ.11.65కోట్ల గ్రాస్‌ వచ్చింది. ఓవర్సీస్‌ కలుపుకొని ప్రపంచ వ్యాప్తంగా మూడు రోజుల్లో రూ.12.90కోట్లు రాబట్టినట్టు సాక్నిల్క్ సైట్‌ వెల్లడించింది. ఈ లెక్క ఆరు కోట్ల షేర్‌ మాత్రమే వచ్చిందని చెప్పొచ్చు. ఈ మూవీ గ్రాండియర్‌ నెస్‌కి, హంగామాకి ఇది చాలా తక్కువ అనే చెప్పాలి. సోమవారం నుంచి వచ్చే కలెక్షన్లు ఈ సినిమా భవిష్యత్‌ని, హిట్టా? ఫట్టా అనే విషయాన్ని డిసైడ్‌ చేయబోతున్నాయి. అయితే ఈ మూవీకి థియేట్రికల్‌గా రూ.50-60కోట్ల బిజినెస్‌గా లెక్కకట్టారు. ఈ లెక్కన వంద కోట్లకుపైగానే గ్రాస్‌ రాబట్టాలి. అది సాధ్యం కాదని

ర జ ల ల న గబ ధ మ వ వస ల చ స ద ఇ త న ష క గ కల క షన ల Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in