
టాలీవుడ్ హిస్టరీనే .. "జగదేకవీరుడు అతిలోకసుందరి (JAGADEKA VEERUDU ATILOKA SUNDARI - )" ముందు, ఆ తర్వాత అని విభజించవచ్చు. వైజయంతీ మూవీస్ పతాకంపై అశ్విని దత్ నిర్మించిన ఈ సోషియో ఫాంటసీ దృశ్యకావ్యం 1990 మే 9న విడుదలై సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది. మెగాస్టార్ చిరంజీవి, "అతిలోకసుందరి" శ్రీదేవి జంటగా దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు తెరకెక్కించిన ఈ సినిమా తెలుగు చిత్రసీమలో ఒక సరికొత్త చరిత్రను తిరగరాసింది. ఈసినిమా ఆల్‌టైమ్ క్లాసిక్ రికార్డులు, షూటింగ్ అనుభవాలు పూర్తి రివ్యూ మీకోసం... రాజు (చిరంజీవి) ఒక అనాథ. నలుగురు అనాథ పిల్లలను చేరదీసి సొంత పిల్లల్లా పెంచుతుంటాడు. అనుకోకుండా ఒక ప్రమాదంలో ఒక చిన్నారి కాలు విరగడంతో, వైద్యం కోసం మానససరోవరంలో మాత్రమే లభించే ఒక ప్రత్యేక మూలిక కోసం రాజు హిమాలయాలకు వెళ్తాడు. మరోవైపు, దేవలోకంలో దేవేంద్రుని కుమార్తె ఇంద్రజ (శ్రీదేవి) భూలోక అందాలను చూడటానికి వస్తుంది. అక్కడ ఆమె తన వద్ద ఉన్న అత్యంత శక్తివంతమైన "అమృత ఉంగరాన్ని" పోగొట్టుకుంటుంది. ఆ ఉంగరం రాజుకు దొరుకుతుంది. ఆ ఉంగరం లేకపోతే ఇంద్రజ తిరిగి దేవలోకానికి వెళ్లలేదు. ఉంగరం కోసం రాజు వెంట పడే ఇంద్రజ, మానవుడైన రాజుతో ప్రేమలో పడటం... మరోవైపు ఆ ఉంగరాన్ని దక్కించుకుని ప్రపంచాన్ని ఏలాలని చూసే మాంత్రికుడు మహాతాంత్రిక్ (అమ్రీష్ పురి) కుట్రలను రాజు ఎలా తిప్పికొట్టాడు? ఇంద్రజ దేవలోకానికి వెళ్లిపోయిందా లేక భూలోకంలో రాజుతోనే ఉండిపోయిందా? అనేదే జగదేకవీరుడు అతిలోకసుందరి కథ. మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో ఇది ఒక అద్భుతమైన సినిమాగా చెప్పవచ్చు. రాజు పాత్రలో మాస్, కామెడీ, యాక్షన్, ఎమోషన్స్‌ను సమపాళ్లలో పండించారు చిరు. పసిపిల్లలతో ఆయన చేసిన కామెడీ సీన్లు, మాస్ డైలాగ్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇవే కాదు యాక్షన్ సీన్స్, డ్యాన్స్ అయితే ఇరగదీసి వదిలిపెట్టాడు చిరు. ఇక ఇంద్రజ పాత్రకు శ్రీదేవి తప్ప మరొకరిని ఊహించలేము
.webp)