రాజ్యసభలో లుంగీవాలా’ దుమారం.. బీజేపీ ఎంపీ
Actor ProfilePolitician

రాజ్యసభలో లుంగీవాలా’ దుమారం.. బీజేపీ ఎంపీ

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
రాజ్యసభలో లుంగీవాలా’ దుమారం.. బీజేపీ ఎంపీపై ఆగ్రహం
Sakshi9 Dec 2026
రాజ్యసభలో లుంగీవాలా’ దుమారం.. బీజేపీ ఎంపీపై ఆగ్రహం

న్యూఢిల్లీ: పార్లమెంట్‌ వేదికగా మరోసారి ప్రాంతీయ గుర్తింపు, సంస్కృతి అంశం రాజకీయ దుమారం రేపింది. రాజ్యసభలో బీజేపీ ఎంపీ సుస్మితా దేవ్‌ చేసిన ‘లుంగీవాలా’ వ్యాఖ్యలపై కేరళకు చెందిన సీపీఎం ఎంపీ జాన్ బ్రిట్టాస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తనను లక్ష్యంగా చేసుకుని ఈ పదాన్ని ఉపయోగించారని ఆరోపించిన బ్రిట్టాస్.. ఇది వ్యక్తిగత వ్యాఖ్యగా చూడలేమని, దక్షిణ భారతీయుల సాంస్కృతిక గుర్తింపును కించపరిచే ప్రయత్నంగా భావించాల్సి ఉంటుందని అన్నారు. ఈ వ్యవహారంపై ఆయన ప్రత్యేక హక్కుల నోటీసు కూడా ఇచ్చారు. రాజ్యసభలో బుధవారం ఉదయం సభ ప్రారంభమైన తర్వాతే ఈ అంశం వేడెక్కింది. బ్రిట్టాస్ తనపై ‘లుంగీవాలా’ అనే పదాన్ని ఉపయోగించడంపై సభ దృష్టికి తీసుకెళ్లారు. ప్రతిపక్ష సభ్యులు ఆయనకు మద్దతుగా నిలవగా.. అధికార పక్ష సభ్యులు మాత్రం సుస్మితా దేవ్‌ వాదనను కూడా సభ వినాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. దీంతో సభలో కొంతసేపు తీవ్ర గందరగోళ పరిస్థితి నెలకొంది. బ్రిట్టాస్ అభ్యంతరం కేవలం తనను ఉద్దేశించి చేసిన వ్యాఖ్య వరకే పరిమితం కాలేదు. ప్రాంతం, భాష, సంప్రదాయ దుస్తులను ఆధారంగా చేసుకుని పార్లమెంట్‌లో ఒక సభ్యుడిని లక్ష్యంగా చేసుకోవడం సరికాదని ఆయన వాదించారు. ‘లుంగీవాలా’ అనే పదం దక్షిణ భారత ప్రజలను ఒక రకమైన సాంస్కృతిక మూసలో చూపించేందుకు చారిత్రకంగా ఉపయోగించబడిందని ఆయన పేర్కొన్నారు. ఇప్పుడు అదే పదాన్ని పార్లమెంట్‌లో ఉపయోగించడం ద్వారా ప్రాంతీయ గుర్తింపును అవమానించే పరిస్థితి ఏర్పడుతోందని అభ్యంతరం వ్యక్తం చేశారు. “లుంగీ ధరించడం తప్పా? ఒకరి సంప్రదాయ దుస్తులు రాజకీయ విమర్శలకు ఆయుధంగా మారాలా?” అన్న ప్రశ్నను బ్రిట్టాస్ లేవనెత్తినట్టుగా నివేదికలు పేర్కొంటున్నాయి. దక్షిణ భారతదేశంలో లుంగీ ఒక సాధారణ సంప్రదాయ వస్త్రమని, దాన్ని అవహేళనకు ఉపయోగించడం ప్రాంతీయ వివక్షకు దారితీస్తుందని ఆయన వాదించారు. ఈ నేపథ్యంలోనే బ్రిట్టాస్ ప్రివిలేజ్ నోటీసు ఇవ్వడం ఈ వివాదానికి మరింత ప్రాధాన్యత తెచ్చింది. పార్లమెంట్ సభ్యుడి గౌరవాన్ని దెబ్బతీసేలా