ఆయనకు రెండు పెళ్లిళ్లు. మొదటి భార్య ఎప్పుడో వదిలేయడంతో రెండో పెళ్లి చేసుకున్నాడు. రెండో భార్యతో కూడా సేమ్ సమస్య. ఏంటా సమస్య అంటే.. తాగుడు! రోజూ ఇంటికి తాగి రావడం నానా గొడవ చేయడం.. ఈ గోలంతా తట్టుకోలేక ప్రేమించి పెళ్లి చేసుకున్న మొదటి భార్య వదిలేసి వెళ్లిపోయింది. రెండో భార్యతో కూడా ఇలాంటి గొడవే వచ్చింది. కానీ, ఈ సారి అతనే ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. ఈ ఘటన కర్నూలులో చోటుచేసుకుంది. కర్నూలులోని ముజఫర్‌నగర్‌కు చెందిన షేక్ జాకీర్ బాషా (40) బేల్దారి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. 15 సంవత్సరాల కిందట బెంగళూరులో పనిచేసే సమయంలో సుహాసిని అలియాస్ ఫర్వీన్ అనే ఆమెను ప్రేమించి వివాహం చేసుకున్నాడు. వీరికి ఒక కుమారుడు కూడా ఉన్నాడు. బెంగళూరు నుంచి కర్నూలుకు మకాం మార్చిన తర్వాత బాషాకి తాగుడు బాగా అలవాటు అయింది. దాంతో ఫర్వీన్ అతనితో తనకు కుదరడం లేదంటూ తెగదెంపులు చేసుకుని వెళ్లిపోయింది. READ ALSO గాదె సాయికృష్ణ కేసులో మరో ట్విస్ట్.. అప్రూవర్‌గా మారనున్న సురేష్? ఇంతకీ ఎవరీ ప్రైవేట్ వ్యక్తి!మొదటి భార్య వెళ్లిపోయిన తర్వాత కర్నూలులోనే రోజావీధికి చెందిన షేక్ ఖాజాబీని రెండో వివాహం చేసుకున్నాడు. ఇక్కడ కూడా అదే సమస్య. రోజూ తాగి రావడం, ఏదో ఒక గొడవ పెట్టుకోవడం. తాగుడు మానుకోకపోవడంతో వీరిద్దరి మధ్య తరచూ ఏవో ఒక గొడవలు జరిగేవి. ఈ క్రమంలోనే జూలై 11వ తేదీ రాత్రి కూడా ఓ గొడవ జరిగింది, కాకపోతే అది విషాదాంతంగా ముగిసింది. గొడవ పెద్దదవడంతో జాకీర్ బాషా ఆ పక్కనే ఉన్న పెట్రోల్ తీసుకుని ఒంటిపై పోసుకుని నిప్పంటించుకున్నాడు. దాంతో ఒళ్లంతా కాలిపోయి తీవ్ర గాయాలతో ఉన్న అతన్ను కుటుంబ సభ్యులు వెంటనే కర్నూలు ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రికి తీసుకొచ్చే సమయానికే జాకీర్ బాషా కొనప్రాణంతో కొట్టుమిట్టాడుతున్నాడు. ఆస్పత్రిలో చికిత్స
Actor ProfilePolitician
రోజూ తాగొస్తున్న భర్త.. ఎప్పటిలాగే భార్యతో గొడవ.. ఒంటి
📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
Samayam Telugu•5 Nov 2026
రోజూ తాగొస్తున్న భర్త.. ఎప్పటిలాగే భార్యతో గొడవ.. ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఊహించని విషాదం