
శ్రీకాకుళం జిల్లా చిలకపాలెం వద్ద అరెస్ట్ మాస్క్ ధరించి కారులో పరారవుతున్న చింతాడ రవికుమార్‌ను అదుపులోకి తీసుకుంటున్న పోలీసులు ఈనాడు డిజిటల్- శ్రీకాకుళం, న్యూస్‌టుడే- శ్రీకాకుళం నేరవార్త విభాగం: రోజుకొక ఫోను, సిమ్.. రెండు రోజులకో చోటు మారుస్తూ.. ఎవరూ గుర్తుపట్టకుండా మాస్క్ ధరించి.. ఎనిమిది రోజులుగా పోలీసుల కళ్లుగప్పి తిరుగుతున్న శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస వైౖకాపా సమన్వయకర్త చింతాడ రవికుమార్‌ను పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. శనివారం రాత్రి 8 గంటల సమయంలో చిలకపాలెం కూడలి వద్ద ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. గత నెల 30న మాజీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి.. రిమాండ్ ఖైదీగా ఉన్న మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును పరామర్శించేందుకు శ్రీకాకుళం వచ్చారు. ఈ సందర్భంగా కొత్తరోడ్డు కూడలి వద్ద బందోబస్తు విధుల్లో ఉన్న బూర్జ మహిళా ఎస్సై ప్రవల్లికపై చింతాడ రవికుమార్ అనుచితంగా ప్రవర్తించారు. ఈ వ్యవహారంలో మొత్తం 28 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఇందులో ఏ1గా చింతాడ రవికుమార్ ఉన్నారు. ఘటన జరిగినప్పటి నుంచీ పరారీలో ఉన్న రవికుమార్ రెండు రోజులకో ప్రాంతం చొప్పున ఒడిశా, విశాఖ, బెంగళూరు, చివరిగా అరకులో మకాం వేసినట్లుగా గుర్తించారు. శనివారం అరకు నుంచి శ్రీకాకుళం వస్తున్నట్లు తెలుసుకున్న పోలీసులు 16వ నంబరు జాతీయ రహదారిపై తనిఖీలు చేపట్టారు. డబ్ల్యూబీ36సీ 5000 నంబరు కలిగిన పశ్చిమబెంగాల్ కారులో రవికుమార్.. ఎవరూ గుర్తుపట్టకుండా మాస్క్ ధరించి వెళ్లిపోతుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్టు సమయంలో కొంతమంది మీడియా ప్రతినిధులతో చింతాడ మాట్లాడుతూ.. డీఎస్పీ కార్యాలయం వద్ద లొంగిపోదామని వెళుతుంటే చిలకపాలెం వద్ద పోలీసులు అడ్డుకున్నారని పేర్కొన్నారు. రవికుమార్‌ను ఆదివారం కోర్టులో హాజరుపరుస్తామని పోలీసులు చెప్పారు. పరారీలో ఆయనకు విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు చెందిన వైకాపా కీలక నేతలు సాయం అందించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. వారిపైనా చర్యలకు రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఈ కేసులో నిందితులుగా ఉన్న వైకాపాకు చెందిన అన్నెపు