రోజుకు కేవలం రూ.67 చాలు
Actor ProfilePolitician

రోజుకు కేవలం రూ.67 చాలు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
రోజుకు కేవలం రూ.67 చాలు, ఏకంగా కోటి రూపాయలు పొందండి.. ఈ ఫార్ములా మీకోసమే
Asianet News Telugu19 Oct 2026
రోజుకు కేవలం రూ.67 చాలు, ఏకంగా కోటి రూపాయలు పొందండి.. ఈ ఫార్ములా మీకోసమే

నెలకు కేవలం రూ.2,000 అంటే రోజుకి రూ.67 పెట్టుబడితో కోటి రూపాయలు సంపాదించడం సాధ్యమేనా? చాలామంది ఇన్వెస్టర్లకు ఈ సందేహం ఉంటుంది. అయితే ఆర్థిక నిపుణుల నుండి సాధ్యమే అన్న సమాధానం వినిపిస్తుంది. కానీ ఇది ఒకటిరెండు రోజుల్లోనో, నెలల్లోనో కాదు కొన్ని సంవత్సరాల్లో అయ్యే పని… చాలా ఏళ్లపాటు క్రమశిక్షణతో పెట్టుబడి పెట్టాలి. అప్పుడే మీరు తక్కువ పెట్టుబడితో కోటీశ్వరులు అయ్యేది. తక్కువ పెట్టుబడితో ఎక్కువ డబ్బులు పొందాలంటే సరైన మ్యూచువల్ ఫండ్‌ను ఎంచుకోవడం చాలా ముఖ్యం. మనీ కంట్రోల్ కథనం ప్రకారం.. సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (SIP) ద్వారా చిన్న మొత్తంలో పెట్టుబడి పెట్టినా, కాలక్రమేణా పెద్ద సంపదను సృష్టించవచ్చు. ముఖ్యంగా చిన్న వయసులో మొదలుపెడితే, కాంపౌండింగ్ ఎఫెక్ట్ వల్ల చిన్న పెట్టుబడే భవిష్యత్తులో భారీ నిధిగా మారుతుంది. మ్యూచువల్ ఫండ్ SIP ద్వారా నెలకు రూ.2,000 పెట్టుబడి పెడుతూ, ఏటా సగటున 10%-15% రాబడి వస్తే, సుమారు 28 నుంచి 38 ఏళ్లలో కోటి రూపాయల లక్ష్యాన్ని చేరుకోవచ్చు. ఈ లెక్కలన్నీ మార్కెట్ దీర్ఘకాలిక పనితీరుపై ఆధారపడి ఉంటాయి. ఇక్కడ పెట్టుబడి పెట్టే సమయం, రాబడి రేటు అనేవి చాలా కీలకం. మ్యూచువల్ ఫండ్ SIP వివరాల కోసం ఆన్‌లైన్ క్యాలిక్యులేటర్‌లను ఉపయోగించవచ్చు. SIP ద్వారా సంపద సృష్టించడానికి చక్రవడ్డీ (Compounding) ప్రధాన కారణం. మొదట్లో మీరు పెట్టిన నెలవారీ పెట్టుబడి మాత్రమే పెరుగుతుంది. కానీ రానురాను దానిపై వచ్చిన లాభం కూడా కలిసి సంపదను పెంచుతుంది. దీంతో చివరి సంవత్సరాల్లో పెట్టుబడి చాలా వేగంగా వృద్ధి చెందుతుంది. అందుకే ఆర్థిక నిపుణులు మార్కెట్‌ను 'టైమింగ్' చేయడం కన్నా, మార్కెట్‌లో 'ఎక్కువ సమయం' ఉండటం ముఖ్యమంటారు. ఎంత త్వరగా పెట్టుబడి మొదలుపెడితే, చక్రవడ్డీ లాభం అంత ఎక్కువగా పొంది, పెద్ద సంపదను నిర్మించవచ్చు. చిన్న వయసులోనే (22-25 ఏళ్లు) నెలకు రూ.2,000 SIP మొదలుపెడితే, చక్రవడ్డీతో దీర్ఘకాలంలో కోటి రూపాయలు

ర జ క క వల ర 67 చ ల Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in