ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రిగా పని చేసిన వైఎస్ రాజశేఖర రెడ్డి 77వ జయంతి నేడు. ఈ సందర్భంగా ఆయన కుమారుడు వైఎస్ జగన్, కుమార్తె షర్మిల ఇడుపులపాయలోని వైఎస్ సమాధి వద్ద నివాళులు అర్పించారు. వైఎస్ జయంతి సందర్భంగా.. ఏపీలోని కాంగ్రెస్, వైఎస్సార్సీపీ నేతలతోపాటు తెలంగాణలోని కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు సైతం ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు.తెలంగాణలో ప్రస్తుతం మంత్రులుగా కీలక స్థానంలో ఉన్న భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖ, దామోదర రాజనర్సింహ, పొన్నం ప్రభాకర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా సోషల్ మీడియా ద్వారా ఆయనకు నివాళులు అర్పించారు. వైఎస్ ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాజకీయాల్లో వీరికి అండగా నిలిచారు.కొండా మురళి, సురేఖ దంపతులకు వైఎస్ వెన్నుదన్నుగా నిలిచారు. 1999, 2004, 2009లో కొండా సురేఖ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలవడంలో రాజశేఖర రెడ్డి కీలక పాత్ర పోషించారు. 2009లో కాంగ్రెస్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆమెను మంత్రివర్గంలోకి తీసుకున్నారు. మహిళా శిశు సంక్షేమ శాఖను సురేఖకు అప్పగించారు. వైఎస్ మరణం తర్వాత జగన్‌ను సీఎం చేయాలని కాంగ్రెస్ అధిష్టానాన్ని డిమాండ్ చేసిన వారిలో కొండా సురేఖ ఒకరు. తర్వాత ఆమె కాంగ్రెస్‌ను వీడి జగన్ వెంట నడిచారు. పరకాల ఉపఎన్నికలో వైఎస్సార్సీపీ తరఫున పోటీ చేశారు. ఆ తర్వాత ఆమె వైఎస్సార్సీపీని వీడి బీఆర్ఎస్‌లోకి తర్వాత కాంగ్రెస్‌లోకి వచ్చినప్పటికీ.. వైఎస్‌తో తమ కుటుంబానికి ఉన్న అనుబంధాన్ని ఆమె మర్చిపోలేదు.తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వైఎస్ రాజశేఖర రెడ్డిని తన రాజకీయ గురువుగా, మార్గదర్శిగా భావిస్తారు. వైఎస్ తరహాలోనే ఆయన పంచె కట్టులో కనిపిస్తారనే సంగతి తెలిసిందే. 2007లో భట్టి విక్రమార్కకు ఎమ్మెల్సీ పదవి దక్కడంలో వైఎస్ కీలక పాత్ర పోషించారు. 2009లో మధిర నుంచి పోటీ చేసిన భట్టి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. వైఎస్ వెంటనే ఆయనకు ప్రభుత్వ
Actor ProfilePolitician
రాజశేఖర రెడ్డికి తెలంగాణ మంత్రుల నివాళులు.. వీరికి వైఎస్ గాడ్ ఫాదర్
📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
Samayam Telugu•10 Oct 2026
రాజశేఖర రెడ్డికి తెలంగాణ మంత్రుల నివాళులు.. వీరికి వైఎస్ గాడ్ ఫాదర్