
Rajahmundry: వైశ్య సంఘాలు రాజకీయాలకు అతీతంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయని, వాటిపై రాజకీయ జోక్యం లేకుండా చూడాలని వైశ్య సంఘాల ప్రతినిధులు కోరారు. తమ సంఘీయులు అన్ని రాజకీయ పార్టీల్లో ఉన్నారని, అయితే సంఘాల విషయానికి వచ్చేసరికి పార్టీలతో సంబంధం లేకుండా సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నామని తెలిపారు. సేవా సంస్థలపై రాజకీయ నీడలు పడకుండా మీడియా, ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. మంగళవారం లాలాచెరువు రోడ్డులోని వైశ్య హాస్టల్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో కోట్ల కనకేశ్వరరావు, మద్దుల మురళీకృష్ణ, పందిరి వీరభద్రస్వామి, ఇన్నమూరి శ్రీరామచంద్రమూర్తి, ఇన్నమూరి దీపు తదితరులు మాట్లాడారు. ఇటీవల వైఎంవిఏ హాలుకు లిఫ్ట్ ఏర్పాటు చేసే విషయంలో వస్తున్న వార్తలపై వారు వివరణ ఇచ్చారు. సేవే ప్రధాన లక్ష్యం కోట్ల కనకేశ్వరరావు మాట్లాడుతూ రాజమహేంద్రవరంలో ఎన్ని వైశ్య సంఘాలు ఉన్నప్పటికీ అందరి ప్రధాన లక్ష్యం సేవాభావమేనని తెలిపారు. సంఘాల్లో అన్ని రాజకీయ పార్టీలకు చెందిన వారు సభ్యులుగా ఉన్నప్పటికీ పార్టీలు, రాజకీయాలకు ఎప్పుడూ ప్రాధాన్యం ఇవ్వలేదన్నారు. విద్యార్థులకు విద్య, వసతి వంటి సేవలను అందిస్తూ అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. వైశ్య సంఘాల ఆధ్వర్యంలోని విద్యా సంస్థల్లో వందలాది మంది విద్యార్థులు వసతి పొందుతూ మంచి ఉత్తీర్ణత సాధిస్తున్నారని తెలిపారు. సేవా సంస్థల్లో రాజకీయ జోక్యం వల్ల సభ్యులకు ఇబ్బందులు ఎదురవుతాయని ఆవేదన వ్యక్తం చేశారు. వైశ్య సంస్థలపై రాజకీయ నీడలు పడకుండా మీడియా, ప్రజలు సహకరించాలని కోరారు.లిఫ్ట్ నిర్మాణానికి ప్రభుత్వ నిధులు తీసుకోలేదు మద్దుల మురళీకృష్ణ మాట్లాడుతూ వైఎంవిఏ హాలును తక్కువ ఖర్చుతో పెళ్లిళ్లు, ఇతర వేడుకలకు అందుబాటులో ఉంచుతున్నామని, ఎన్నో సేవా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నామని చెప్పారు. వైఎంవిఏ హాలు పక్కన ఉన్న చిన్న స్థలంలో వ్యాయామ కళాశాల ఉన్నప్పటికీ గత 15 ఏళ్లుగా అక్కడ ఎలాంటి కార్యకలాపాలు జరగడం లేదన్నారు. ఇటీవల వైఎంవిఏ హాలుకు లిఫ్ట్ ఏర్పాటు చేయాలని భావించి, ఖాళీ స్థలానికి కొంత పరిహారం కూడా