రాజమహేంద్రవరం కారు ప్రమాద ఘటన
Actor ProfilePolitician

రాజమహేంద్రవరం కారు ప్రమాద ఘటన

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
రాజమహేంద్రవరం కారు ప్రమాద ఘటన - వైద్య విద్యార్థిని ప్రియాంక మృతి
Telugu Times24 Nov 2026
రాజమహేంద్రవరం కారు ప్రమాద ఘటన - వైద్య విద్యార్థిని ప్రియాంక మృతి

రాజమహేంద్రవరం (Rajamahendravaram)లో ఇటీవల చోటుచేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వైద్య విద్యార్థిని ప్రియాంక (Priyanka) మృతి చెందారు. వెంటలేటర్‌‌పై చికిత్స చికిత్స పొందుతున్న ఆమె ఆదివారం మధ్యాహ్నం 3.25 గంటలకు తుదిశ్వాస విడిచినట్లు హైదరాబాద్ కిమ్స్‌ ‌వైద్యులు బులిటెన్‌ ‌విడుదల చేశారు. ప్రియాంక పార్థివ దేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. రాజమహేంద్రవరం పోలీసులు, ప్రియాంక తండ్రి వెంకటేష్‌ వచ్చిన తర్వాత మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించనున్నారు. ప్రియాంక కుటుంబానికి రూ.20 లక్షలు ఆర్థిక సాయం అందించాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) ఆదేశించారు. ఆ కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. ప్రియాంక స్వస్థలం తెలంగాణ (Telangana) రాష్ట్రం జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మండలం ఏక్లాస్‌పూర్. ఎంబిబిఎస్‌ పూర్తి చేసిన ఆమె తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలోని జిఎస్‌ఎల్‌ వైద్య కళాశాలలో డెర్మటాలజీ డెర్మటాలజీ విభాగంలో పీజీ మొదటి సంవత్సరం చదువుతున్నారు. తల్లిదండ్రులు హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. ఈ నెల మూడున రాత్రి ఆంధ్రప్రదేశ్ లోని రాజమహేంద్రవరంలోగల ప్రసాద్‌ ఆదిత్యమాల్‌లో సినిమా చూసి, సహచర విద్యార్థితో కలిసి ద్విచక్ర వాహనంపై ఆమె వస్తున్నారు. మద్యం మత్తులో కారు నడుపుతూ వచ్చిన దుష్యంత్‌, మరో వ్యక్తి ‌బలంగా ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టడంతో ప్రియాంక తీవ్రంగా గాయపడ్డారు. పైనుంచి కారు వెళ్లడంతో కిందపడిపోయిన ఆమె తలకు తీవ్ర గాయమైంది. ఆమెను స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు ఆస్ప్రతిలో చేర్చారు. పరిస్థితి విషమించడంతో ఈ నెల ఐదున సికింద్రాబాద్‌లోని కిమ్స్‌ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించినా ఫలితం లేకపోయింది

ర జమహ ద రవర క ర ప రమ ద ఘటన Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in