రాజకీయ లబ్ధి కోసమే కేటీఆర్ పొలిటికల్ డ్రామా
Actor ProfilePolitician

రాజకీయ లబ్ధి కోసమే కేటీఆర్ పొలిటికల్ డ్రామా

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
రాజకీయ లబ్ధి కోసమే కేటీఆర్ పొలిటికల్ డ్రామా
Telugu Times2 Dec 2026
రాజకీయ లబ్ధి కోసమే కేటీఆర్ పొలిటికల్ డ్రామా

రాయదుర్గంలో నిర్మించతలపెట్టిన పీఎం ఏక్తా మాల్ ( PM Ekta Mall) టెండర్లపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) చేస్తున్న ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు మంత్రి శ్రీధర్‌బాబు (Sridhar Babu) తెలిపారు. టెండర్లలో ఎలాంటి అవకతవకలు జరగలేదని, నిబంధనల ప్రకారం పూర్తి పాదర్శకంగా ఈ ప్రక్రియ కొనసాగిందని చెప్పారు. రావిర్యాలలో సీఎం రేవంత్ (CM Revanth) సోదరుడి కంపెనీకి తక్కువ ధరకే భూములు కేటాయించారన్న ఆరోపణలపై మంత్రి స్పందించారు. సీఎం సోదరుడికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. భూ కేటాయింపుల్లో రాష్ట్ర ప్రభుత్వం వంద శాతం పారదర్శకత పాటిస్తోందన్నారు. రాజకీయ లబ్ధికోసం కేటీఆర్ ఆడుతున్న పొలిటికల్ డ్రామా ఇది. జాతీయ ప్రాముఖ్యత కలిగిన ప్రాజెక్టులపై కేటీఆర్ రాజకీయం చేయడం సరికాదు. కేంద్ర ప్రభుత్వ నిధులతో రూపొందుతున్న పీఎం ఏక్తా మాల్ పై తప్పుడు ప్రచారాన్ని ఆయన మానుకోవాలన్నారు

ర జక య లబ ధ క సమ క ట ఆర ప ల ట కల డ ర మ Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in