
శ్రీరామునికి రామ జన్మభూమిలో రామ మందిరం నిర్మాణానికి ఎవరి స్థితికి తగ్గట్టు విరాళాలు ఇచ్చారని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. బీజేపీ నాయకులు రాముని పేరుతో, అక్షింతలపై విరాళాలు అడుక్కున్నారని విమర్శించారు. సిద్దిపేట, జులై 6: శ్రీరామునికి రామ జన్మభూమిలో రామ మందిరం నిర్మాణానికి ఎవరి స్థితికి తగ్గట్టు విరాళాలు ఇచ్చారని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఈరోజు(సోమవారం) మీడియాతో మాట్లాడుతూ.. విరాళాల్లో కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని ఆరోపించారు. బీజేపీ నాయకులు.. రాముని పేరుతో, అక్షింతలపై విరాళాలు అడుక్కున్నారని విమర్శించారు. బీజేపీ నాయకుల అవినీతిని గుర్తించి అయోధ్య ప్రజలే ఆ పార్టీ ఎంపీని ఓడించారన్నారు. ఈ విషయంలో బీజేపీ స్పందించి.. దేశ ప్రజలందరికీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రాజకీయంగా ఎదగడానికి రాముని పేరును కమలం పార్టీ వాడుకుందని ఆరోపించారు. రాజకీయం వేరు, భక్తి వేరని మంత్రి తెలిపారు. ఈ విషయంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, అమిత్ షా, యూపీ ముఖ్యమంత్రిదే బాధ్యత అని అన్నారు. రాముడి హుండీలోని విరాళాలను ఎత్తుకెళ్లడం దేశ ప్రజలకు అవమానకరమన్నారు. భక్తి పేరుతో, రాముని పేరుతో రాజకీయం చేసే వారి రంగును ప్రజలు గుర్తించాలని తెలిపారు. దేవుడి పేరుపై బీజేపీ స్కాం చేసిందని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. కొరియా ఎలక్ట్రానిక్స్ కంపెనీలు వచ్చేలా సహకరించండి ఏపీకి పెట్టుబడులే లక్ష్యం.. దక్షిణ కొరియా పర్యటనలో లోకేశ్ బిజీబిజీ