రెచ్చిపోయిన సైబర్ క్రిమినల్స్
Actor ProfilePolitician

రెచ్చిపోయిన సైబర్ క్రిమినల్స్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
రెచ్చిపోయిన సైబర్ క్రిమినల్స్
Andhra Jyothy8 Jan 2027
రెచ్చిపోయిన సైబర్ క్రిమినల్స్

3 కేసుల్లో 33.98 లక్షలు లూటీ.. నిర్మలా సీతారామన్‌ పేరుతో ఏఐ ప్రకటన హైదరాబాద్‌ సిటీ: హైదరాబాద్‌ సిటీ కమిషనరేట్‌ పరిధిలో సోమవారం ఒక్కరోజే సైబర్‌ నేరగాళ్లు రూ. 33.98 లక్షలు కొల్లగొట్టారు. బాధితుల్లో ఇద్దరు రిటైర్డ్‌ ప్రభుత్వ ఉద్యోగులు ఉండగా.. ఒక దినసరి కూలీ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. సిటీ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కేంద్ర మంత్రి వాయిస్‏తో... కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ వాయి్‌సతో.. ఏఐ (ఆర్టిఫీషియల్‌ ఇంటలీజెన్స్‌) వీడియోను తయారు చేసిన సైబర్‌ నేరగాళ్లు ఆన్‌లైన్‌ వ్యాపారాల్లో పెట్టుబడులు పెడితే అధిక లాభాలంటూ బురిడీ కొట్టించారు. నగరానికి చెందిన 80 ఏళ్ల రిటైర్డ్‌ అసిస్టెంట్‌ కమాండెంట్‌ (సీఆర్‌పీఎఫ్‌) నుంచి రూ.3.85 లక్షలు దోచేశారు. ఒక గుర్తుతెలియని వ్యక్తి ఫోన్‌ చేసి ఇన్వెస్టిమెంట్‌ ప్లాన్స్‌, అధిక లాభాల గురించి వివరించాడు. పెట్టుబడి పెట్టడానికి సమ్మతించడంతో ఆధార్‌, పాన్‌, బ్యాంకు డిటెయిల్స్‌ తీసుకొని రిజిస్టర్‌ చేశారు. తర్వాత ప్రారంభంలో రూ.20వేలు మాత్రమే పెట్టుబడి పెట్టించి మంచి లాభాలు వచ్చినట్లు డాలర్స్‌లో (యూఎ్‌సడీ) చూపించారు. ప్రారంభంలో మంచి లాభాలు అందుకున్న బాధితుడిని మెల్లగా ఇన్వెస్ట్‌ మెంట్‌ ఊబిలోకి దింపారు. విడతల వారీగా పెట్టుబడులు పెట్టించి రూ.3.85 లక్షలు దోచేశారు. ఏపీకే ఫైల్స్‌తో రూ.30 లక్షలు.. ఏపీకే ఫైల్స్‌ పంపి.. వాటిని క్లిక్‌ చేయగానే ఫోన్‌ హ్యాక్‌ చేస్తున్న సైబర్‌ క్రిమినల్స్‌.. నగరంలో ఒక రిటైర్డ్‌ ప్రభుత్వ ఉద్యోగి, మరో దినసరి కూలీ నుంచి రూ. 30 లక్షలు దోచేశారు. బుద్వేల్‌కు చెందిన 63 ఏళ్ల రిటైర్డ్‌ ఉద్యోగి యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా పేరుతో ఏపీకే ఫైల్‌ మెసేజ్‌ వచ్చింది. మీరు ఖాతాకు కేవైసీ అప్‌డేట్‌ చేయలేదని అందుకే ఖాతాను బ్లాక్‌ చేస్తున్నట్లు అందులో ఉంది. వెంటనే అప్‌డేట్‌ కోసం లింకును డౌన్‌లోడ్‌ చేసుకోవాలని చెప్పడంతో బాధితుడు ఆ ఫైల్‌ను ఇన్‌స్టాల్‌ చేశాడు. అంతే

ర చ చ ప య న స బర క ర మ నల స Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in