రంగంలోకి దిగిన జాతీయ మహిళా కమిషన్
Actor ProfilePolitician

రంగంలోకి దిగిన జాతీయ మహిళా కమిషన్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
రంగంలోకి దిగిన జాతీయ మహిళా కమిషన్
TeluguOne21 Oct 2026
రంగంలోకి దిగిన జాతీయ మహిళా కమిషన్

భారతదేశంలో సంతానలేమి సమస్యలు ఎదుర్కొంటున్న దంపతులకు ఐవీఎఫ్ (In Vitro Fertilisation) మరియు అసిస్టెడ్ రీప్రొడక్టివ్ టెక్నాలజీ (ART) కేంద్రాలు కొత్త ఆశలను అందిస్తున్నాయి. దేశవ్యాప్తంగా దాదాపు 2.8 కోట్ల మంది ప్రజలు సంతానలేమితో బాధపడుతున్నారని గణాంకాలు చెబుతున్నాయి. ఈ క్రమంలోనే ప్రతి సంవత్సరం సుమారు 3 నుండి 3.5 లక్షల ఐవీఎఫ్ సైకిల్స్ జరుగుతున్నాయి. ఇంతటి భారీ డిమాండ్ ఉన్న ఈ రంగం ఇటీవల కాలంలో కొన్ని అక్రమాలకు, అవకతవకలకు కేంద్రంగా మారుతోందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. కేవలం రిజిస్ట్రేషన్లు మాత్రమే ఈ అనైతిక పద్ధతులను అడ్డుకోలేకపోతున్నాయని స్పష్టమవుతోంది. ముఖ్యంగా గురుగ్రామ్‌లో వెలుగుచూసిన ఒక దారుణమైన ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఒక దంపతులు ఐవీఎఫ్ ద్వారా జన్మించిన తమ కవల పిల్లలకు డీఎన్ఏ పరీక్షలు చేయించగా, ఆ పిల్లలు జీవశాస్త్రపరంగా తమరు కాదని తేలింది. ఈ తరహా మోసాలు, ఎంబ్రియోల మార్పిడి ఘటనలు రోగులలో తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో, జాతీయ మహిళా కమిషన్ (NCW) ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది. దేశంలో వేగంగా విస్తరిస్తున్న ఐవీఎఫ్ క్లినిక్‌లు, ఏఆర్టీ కేంద్రాలు మరియు వీర్య/అండాల బ్యాంకుల (Gamete Banks) నియంత్రణ వ్యవస్థను సమగ్రంగా సమీక్షించడానికి ఒక ఉన్నత స్థాయి నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. ఢిల్లీ హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఆశా మీనన్ నేతృత్వంలో ఈ కమిటీ పనిచేయనుంది. ఈ ప్యానెల్‌లో న్యాయవ్యవస్థ, వైద్యం, ఫోరెన్సిక్ సైన్స్, చట్టాల అమలు సంస్థలు, గైనకాలజీ, పబ్లిక్ పాలసీ మరియు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖకు చెందిన ప్రముఖ నిపుణులు సభ్యులుగా ఉన్నారు. మహిళల పునరుత్పత్తి హక్కులు, గౌరవం మరియు భద్రతను కాపాడటమే లక్ష్యంగా ఈ కమిటీ పనిచేస్తుందని ఎన్‌సీడబ్ల్యూ స్పష్టం చేసింది. వైద్య పర్యాటకం (Medical Tourism) పేరుతో విదేశీయులను ఆకర్షిస్తూ, లింగ నిర్ధారణ వంటి చట్టవిరుద్ధమైన పనులకు పాల్పడే క్లినిక్‌లపై కూడా ఈ కమిటీ ప్రత్యేక నిఘా ఉంచనుంది. వివిధ

ర గ ల క ద గ న జ త య మహ ళ కమ షన Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in