
ప్రైవేటు ఆస్పత్రుల్లో రక్తపరీక్షల పేరిట దోపిడీ వనపర్తి న్యూటౌన్, న్యూస్‌టుడే : జిల్లా వ్యాప్తంగా కొన్ని ప్రైవేటు ఆస్పత్రులు, పాలిక్లినిక్‌లు, నర్సింగ్ హోమ్‌లు వ్యాపార ధోరణిలో నడుస్తున్నాయి. ప్రతి ఆస్పత్రికి అనుబంధంగా రక్త, మూత్ర పరీక్షలు చేసే ల్యాబ్‌లను ఏర్పాటు చేసుకున్నారు. చికిత్సకు వచ్చే రోగులకు అవసరం లేకున్నా అన్నిరకాల పరీక్షలు చేయించాలని సూచిస్తున్నారు. టెస్టులకు రూ.వేలు వసూలు చేస్తున్నారు. ఎవరైనా ముందే మరో ల్యాబ్‌లో చేయించిన పరీక్షల రిపోర్టులు చూపిస్తే ఇవి నమ్మదగ్గట్లుగా లేవని.. తమ ఆస్పత్రిలోని ల్యాబ్‌లోనే చేయించాలని చెబుతున్నారు. ఇష్టారాజ్యంగా బిల్లులు వసూలు చేస్తున్నారు. స్కానింగ్ సెంటర్ల నుంచి కమీషన్ : ప్రైవేటు వైద్యులు సూచించిన కేంద్రాల్లోనే రోగులు స్కానింగ్ చేయించాలి. కాదని ప్రభుత్వ ఆస్పత్రిలో చేయిస్తే.. స్పష్టంగా వివరాలు తెలియడం లేదని కమీషన్ కోసం మళ్లీ ప్రైవేటు కేంద్రంలోనే స్కానింగ్ చేయించుకుని రావాలని పంపుతున్నారు. అక్కడ సుమారు రూ.4 వేల వరకు వసూలు చేస్తున్నారు. డిజిటల్ ఎక్స్‌రేలకు పరిధిని బట్టి రూ. 500 వరకు తీసుకుంటున్నారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి సాయినాథ్ రెడ్డి మాట్లాడుతూ నిబంధనల ప్రకారం పరీక్షను బట్టి డబ్బులు తీసుకోవాలని ఎక్కువగా వసూలు చేస్తే విచారణ చేసి చర్యలు తీసుకుంటామన్నారు. వెంటనే జిల్లా వ్యాప్తంగా తనిఖీలు చేపడతామని తెలిపారు. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు