రాకా’.. నాలుగు వేర్వేరు పాత్రల్లో అల్లు అర్జున్
Actor ProfileActor

రాకా’.. నాలుగు వేర్వేరు పాత్రల్లో అల్లు అర్జున్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
రాకా’.. నాలుగు వేర్వేరు పాత్రల్లో అల్లు అర్జున్
Eenadu31 Oct 2026
రాకా’.. నాలుగు వేర్వేరు పాత్రల్లో అల్లు అర్జున్

ఇంటర్నెట్ డెస్క్: అగ్ర నటుడు అల్లు అర్జున్‌ (Allu Arjun) హీరోగా, దర్శకుడు అట్లీ తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్‌ మూవీ ‘రాకా’ (Raaka). ప్రస్తుతం సెట్స్‌పై ఉన్న భారతీయ ప్రతిష్ఠాత్మకమైన చిత్రాల్లో ఇదీ ఒకటి. అయితే ఈ మూవీలో అల్లు అర్జున్ నాలుగు వేర్వేరు పాత్రలు పోషించనున్నట్లు సమాచారం. తాత, తండ్రి, ఇద్దరు కొడుకులుగా కనిపించనున్నారని టాక్‌. ఒకవేళ అదే నిజమైతే ఇది ఆయన సినీ కెరీర్‌లోనే ఫస్ట్ మల్టిపుల్ రోల్ సినిమాగా నిలుస్తుంది. ఈ మూవీలో మొదట అట్లీ డబుల్ రోల్ ప్లాన్ చేశారట. తండ్రి, తాత పాత్రలకు వేరే నటులను తీసుకోవాలనుకున్నారు. కానీ, అల్లు అర్జున్ నాలుగు పాత్రలను తానే చేస్తానని అన్నారట. మొదట్లో అట్లీకి సందేహం ఉన్నా, లుక్ టెస్ట్ తర్వాత ఇదే సినిమాకు ప్లస్ అవుతుందని భావించినట్లు తెలుస్తోంది. ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇక ఈ మూవీలో దీపికా పదుకొణె కథానాయిక. గ్లోబల్ స్థాయిలో ఎప్పుడూ చూడని విజువల్స్ ఇందులో ఉంటాయని అట్లీ హామీ ఇచ్చారు. ప్రస్తుతం ముంబైలో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. 2027లో ఈ భారీ ప్రాజెక్ట్ ప్రపంచవ్యాప్తంగా పలు థియేటర్లలో విడుదల కానుంది. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు

ర క న ల గ వ ర వ ర ప త రల ల అల ల అర జ న Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in