రష్యా నుంచి భారత్‌కు రైలులో సరుకు రవాణా చేసే మార్గం ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రపంచంలోని కీలక సముద్ర వాణిజ్య మార్గాల్లో అనిశ్చిత పరిస్థితులు నెలకొంటున్న నేపథ్యంలో.. సముద్ర మార్గాలకు ప్రత్యామ్నాయంగా భారీ రైల్వే కారిడార్‌ను అభివృద్ధి చేసే అవకాశాన్ని రష్యా పరిశీలిస్తోంది. రష్యా ఉప ప్రధాని మరాట్ ఖుస్నులిన్ ఈ ప్రతిపాదనను ప్రస్తావించారు. రష్యా నుంచి హిందూ మహాసముద్రం వరకు రైల్వే లింక్ ఏర్పాటు చేసే సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని ఆయన సూచించారు. తుర్క్‌మెనిస్తాన్, ఇరాన్, అఫ్గానిస్థాన్, పాకిస్థాన్ మీదుగా ఈ రైల్వే మార్గాన్ని తీసుకెళ్లే అవకాశం ఉందని తెలిపారు. భారత్‌కు చేరుకునే అవకాశం కల్పించే ఏ రూట్ అయినా తమకు పరిశీలనీయమేనని పేర్కొన్నారు.సముద్ర మార్గాలకు ప్రత్యామ్నాయం ఎందుకు?బోస్ఫరస్, హోర్ముజ్ జలసంధులపై ఆధారపడే అంతర్జాతీయ వాణిజ్య మార్గాలకు భద్రతాపరమైన ముప్పులు పెరుగుతున్న నేపథ్యంలో రష్యా ఈ ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా హర్మూజ్ జలసంధి ప్రపంచ ఇంధన సరఫరాలో అత్యంత కీలకమైన మార్గాల్లో ఒకటి. ప్రపంచ చమురు వాణిజ్యంలో సుమారు నాలుగో వంతు, ప్రపంచ ఎల్ఎన్‌జీ సరఫరాల్లో దాదాపు ఐదో వంతు ఈ ప్రాంతం గుండా సాగుతుందని అంచనా. ఈ మార్గంలో అంతరాయం ఏర్పడితే అంతర్జాతీయ ఇంధన మార్కెట్లపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంటుంది.ఇటీవలి కాలంలో అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య సైనిక ఉద్రిక్తతలు పెరగడంతో హర్మూజ్ జలసంధి ప్రాధాన్యం మరింత పెరిగింది. ఈ నేపథ్యంలో సముద్ర మార్గాల్లో అంతరాయాలు ఏర్పడే పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రత్యామ్నాయ రవాణా మార్గాలు అవసరమని రష్యా భావిస్తోంది. రష్యా ప్రతిపాదనల ప్రకారం సాధ్యమైన రైల్వే కారిడార్ తుర్క్‌మెనిస్తాన్ నుంచి ఇరాన్, అఫ్గానిస్థాన్, పాకిస్థాన్ మీదుగా హిందూ మహాసముద్రంకు చేరేలా ఉండనుంది. ఈ మార్గం పూర్తిగా అమలులోకి వస్తే రష్యాకు సముద్ర మార్గాలపై ఆధారపడటాన్ని కొంత మేర తగ్గించే అవకాశం ఉంటుంది.ముఖ్యంగా భారత్‌తో వాణిజ్య సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు ఈ తరహా భూభాగ రవాణా
Actor ProfileCelebrity
రష్యా నుంచి భారత్ కు రైలు మార్గం.. వయా పాకిస్థాన్
📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
Samayam Telugu•22 Nov 2026
రష్యా నుంచి భారత్ కు రైలు మార్గం.. వయా పాకిస్థాన్