రవితేజ సినిమా నుంచి వారు వాకౌట్.. కారణం ఏమిటో
Actor ProfileActor

రవితేజ సినిమా నుంచి వారు వాకౌట్.. కారణం ఏమిటో

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
రవితేజ సినిమా నుంచి వారు వాకౌట్.. కారణం ఏమిటో
123Telugu29 Nov 2026
రవితేజ సినిమా నుంచి వారు వాకౌట్.. కారణం ఏమిటో

మాస్ మహారాజా రవితేజ వరుస ప్లాప్‌ల తర్వాత తన సినిమా బిజినెస్ మోడల్‌లో మార్పులు చేశాడు. ఆయన నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఇరుముడి’ షూటింగ్ పూర్తి చేసుకుని, ఆగస్టు 21న విడుదల కానుంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమా కోసం రవితేజ తక్కువ రెమ్యూనరేషన్ తీసుకుని, లాభాల్లో వాటా ప్రాతిపదికన పనిచేశారు. అలాగే మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌లోనే దర్శకుడు వివేక్ ఆత్రేయతో ఒక స్టైలిష్ యాక్షన్ డ్రామా చేసేందుకు రవితేజ అంగీకరించాడు. వచ్చే ఏడాది ప్రారంభంలో ఈ ప్రాజెక్ట్ సెట్స్‌పైకి వెళ్లాల్సి ఉంది. అయితే, తాజాగా ఈ ప్రాజెక్ట్‌లో కీలక మార్పులు చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ అనుకోని కారణాల వల్ల ఈ సినిమా నుంచి తప్పుకున్నారట. దిల్ రాజు పార్ట్నర్‌గా ఉండి ఇటీవలే వేరుపడిన లక్ష్మణ్ ఈ చిత్రాన్ని నిర్మించేందుకు ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానుంది. కాగా, రవితేజ త్వరలోనే హసిత్ గోలి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించనున్న మరో సినిమాను ప్రారంభించనున్నాడు. ఈ సినిమాను సంక్రాంతి 2027 నాటికి విడుదల చేసేందుకు చిత్రబృందం ప్లాన్ చేస్తోంది

రవ త జ స న మ న చ వ ర వ క ట క రణ ఏమ ట Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in