రవితేజ 'ఇరుముడి' నుంచి 'మల్లెపూల పల్లకి' సాంగ్ వచ్చేసింది
Actor ProfileActor

రవితేజ 'ఇరుముడి' నుంచి 'మల్లెపూల పల్లకి' సాంగ్ వచ్చేసింది

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
రవితేజ 'ఇరుముడి' నుంచి 'మల్లెపూల పల్లకి' సాంగ్ వచ్చేసింది
AP7AM31 Dec 2026
రవితేజ 'ఇరుముడి' నుంచి 'మల్లెపూల పల్లకి' సాంగ్ వచ్చేసింది

మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా, విలక్షణ దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'ఇరుముడి'. భారీ అంచనాల మధ్య రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా నుంచి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మొదటి పాట విడుదలైంది. 'మల్లెపూల పల్లకి' అంటూ సాగే ఈ పాట లిరికల్ వీడియోను చిత్ర బృందం ఆదివారం విడుదల చేసింది. హైదరాబాదులో ఆదివారం ఏర్పాటు చేసిన గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఈ సాంగ్ ను ఆవిష్కరించారు. విడుదలైన కొద్దిసేపటికే ఈ పాట సంగీత ప్రియులను విశేషంగా ఆకట్టుకుంటూ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.ప్రముఖ సంగీత దర్శకుడు జీవీ ప్రకాశ్ కుమార్ స్వరపరిచిన ఈ 'మల్లెపూల పల్లకి' పాటకు చౌడం శ్రీనివాసరావు సాహిత్యం అందించారు. గాయకుడు డప్పు శ్రీను తన గాత్రంతో పాటకు ప్రాణం పోశారు. రవితేజ ఎనర్జీకి తగినట్టుగా జీవీ ప్రకాశ్ అందించిన సంగీతం, క్యాచీ ట్యూన్ ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తున్నాయి. ఈ పాట సినిమాపై ఉన్న అంచనాలను మరింత పెంచిందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.ప్రేమకథా చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న శివ నిర్వాణ, మాస్ ఇమేజ్‌ ఉన్న రవితేజ కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమాపై సినీ వర్గాల్లో మొదటి నుంచి భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇందులో రవితేజ సరసన ప్రియా భవానీ శంకర్ నటించారు. బేబీ నక్షత్ర కీలక పాత్ర పోషించింది. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు. గుల్షన్ కుమార్, భూషణ్ కుమార్, టీ-సిరీస్ ఫిల్మ్స్

రవ త జ ఇర మ డ న చ మల ల ప ల పల లక స గ వచ చ స ద Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in