
విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్, క్రైమ్ కేటగిరీలకు సంబంధించిన వార్తలు కూడా రాస్తూ ఉంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆమెకు జర్నలిజంలో పదేళ్లకు పైగా అనుభవం ఉంది. Rajinikanth:సూపర్‌స్టార్ రజనీకాంత్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ధర్మన్ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఓరి దేవుడా, డ్రాగన్ చిత్రాల దర్శకుడు అశ్వత్ మారిముత్తు ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ ప్రాజెక్ట్‌లో టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని కీలక పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం రావడంతో సినిమాపై ఆసక్తి మరింత పెరిగింది. ధర్మన్ లో రామ్ పోతినేని రజనీకాంత్‌కు అల్లుడి పాత్రలో కనిపించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. అంతేకాదు, సినిమాలో ఆయన పాత్ర నెగెటివ్ షేడ్స్‌తో పవర్‌ఫుల్‌గా ఉంటుందని తెలుస్తోంది. హీరోగా వరుస సినిమాలు చేస్తున్న రామ్.. తొలిసారి ఇలాంటి విభిన్నమైన పాత్రలో కనిపించబోతున్నారనే వార్త అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది. ఇది కేవలం అతిథి పాత్ర కాదని, కథను కీలక మలుపు తిప్పే స్థాయిలో ఉంటుందని టాక్ వినిపిస్తోంది. సినిమాలో రజనీకాంత్ కుమార్తె పాత్రలో రాశీ ఖన్నా నటిస్తున్నట్లు సమాచారం. ఆమె ప్రేమించిన యువకుడిగా, అనంతరం ఆమెను వివాహం చేసుకున్న వ్యక్తిగా రామ్ పోతినేని కనిపించనున్నట్లు తెలుస్తోంది. దీంతో రజనీకాంత్, రామ్ మధ్య మామా అల్లుళ్లుగా సాగే సన్నివేశాలు సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇద్దరి మధ్య వచ్చే ఘర్షణలు భారీ యాక్షన్ ఎపిసోడ్లకు దారితీస్తాయని ప్రచారం జరుగుతోంది. ఈ పాత్ర కోసం ముందుగా ధృవ్ విక్రమ్‌ను సంప్రదించినట్లు కూడా సమాచారం. అయితే ఆయన ఈ ఆఫర్‌ను అంగీకరించకపోవడంతో రామ్ పోతినేనిని సంప్రదించినట్లు తెలుస్తోంది. కథ, పాత్ర నచ్చడంతో రామ్ ఈ ప్రాజెక్ట్‌కు ఓకే చెప్పినట్లు టాక్