రక్తచరిత్ర రాయనున్న ఫౌజీ’..కొత్త పోస్టర్ తో ప్రభాస్ అరాచకం
Actor ProfileActor

రక్తచరిత్ర రాయనున్న ఫౌజీ’..కొత్త పోస్టర్ తో ప్రభాస్ అరాచకం

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
రక్తచరిత్ర రాయనున్న ఫౌజీ’..కొత్త పోస్టర్ తో ప్రభాస్ అరాచకం
123Telugu25 Dec 2026
రక్తచరిత్ర రాయనున్న ఫౌజీ’..కొత్త పోస్టర్ తో ప్రభాస్ అరాచకం

పాన్-ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా దర్శకుడు హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న పీరియడ్ వార్ యాక్షన్ డ్రామా ‘ఫౌజీ’ రిలీజ్ డేట్ ఇప్పటికే ఫిక్స్ అయింది. మైత్రీ మూవీ మేకర్స్ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని డిసెంబర్ 3న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అయితే, స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా విడుదల చేసిన కొత్త పోస్టర్ సోషల్ మీడియాలో విపరీతంగా ఆకట్టుకుంటోంది. గాంధీజీ వేషధారణలో ఉన్న ఒక వృద్ధుడు ఛార్మినార్ వైపు నడుస్తుండగా, రక్తపు మరకల దుస్తుల్లో రెండు చేతుల్లో పిస్టల్స్ పట్టుకుని ఉన్న ప్రభాస్ లుక్ సినిమాపై అంచనాలను ఒక్కసారిగా పెంచేసింది. ఈ పోస్టర్‌లో ప్రభాస్ ముఖాన్ని చూపించకుండా సస్పెన్స్ క్రియేట్ చేయడం విశేషం. థియేటర్లలోనే ఆ అసలైన యాక్షన్ విస్ఫోటనాన్ని ప్రేక్షకులకు అందించాలని చిత్రబృందం ప్లాన్ చేస్తోంది. ఈ చిత్రంలో ఇమాన్వి హీరోయిన్ గా నటిస్తుండగా, అనుపమ్ ఖేర్, జయప్రద, మిథున్ చక్రవర్తి, చైత్ర జె. ఆచార్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్న ఈ పవర్ ఫుల్ డ్రామా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టిస్తుందని ప్రభాస్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు

రక తచర త ర ర యన న న ఫ జ క త త ప స టర త ప రభ స అర చక Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in