యువత ఇతర రాష్ట్రాలకు వెళ్లొద్దు.. మన అమరావతి
Actor ProfilePolitician

యువత ఇతర రాష్ట్రాలకు వెళ్లొద్దు.. మన అమరావతి

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
యువత ఇతర రాష్ట్రాలకు వెళ్లొద్దు.. మన అమరావతి, విశాఖ, కర్నూలులోనే ఉద్యోగాలు
NTV Telugu24 Dec 2026
యువత ఇతర రాష్ట్రాలకు వెళ్లొద్దు.. మన అమరావతి, విశాఖ, కర్నూలులోనే ఉద్యోగాలు

Nara Lokesh: విజయవాడలో నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన జాతీయ పతాకం ప్రాధాన్యత, స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలు, విద్యా రంగంలో సంస్కరణలు, ఉద్యోగాల కల్పన, అమరావతి, పోలవరం, విశాఖ స్టీల్ ప్లాంట్‌తో పాటు రాష్ట్ర భవిష్యత్ అభివృద్ధిపై కీలక వ్యాఖ్యలు చేశారు. 2047 నాటికి వికసిత ఆంధ్రప్రదేశ్‌ను సాధించేందుకు ప్రతి ఒక్కరూ కసితో పనిచేయాలని పిలుపునిచ్చారు. కులమతాలకు అతీతమైన జెండా పండుగ కులం, మతం అనే భేదాలు లేని ఏకైక జాతీయ పండుగ స్వాతంత్ర్య దినోత్సవమని నారా లోకేష్ అన్నారు. విజయవాడలోని వేడుకల వాతావరణం చూసినప్పుడు తన స్కూల్ రోజులు గుర్తుకొచ్చాయని చెప్పారు. చిన్నతనంలో జెండాలు కట్టి, వివిధ పోటీల్లో పాల్గొని, జెండా పండుగ సందర్భంగా బహుమతులు అందుకునే వాళ్లమని గుర్తుచేసుకున్నారు. ప్రతి ఇంటిపైనా జాతీయ జెండా ఎగురవేయాలని ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపును ప్రతి ఒక్కరూ పాటించాలని కోరారు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించాలి అహింసా మార్గంలో దేశానికి స్వాతంత్ర్యం సాధించిన మహాత్మా గాంధీని లోకేష్ స్మరించుకున్నారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్, ఝాన్సీ లక్ష్మీబాయి వంటి ఎందరో మహనీయులు స్వాతంత్ర్యం కోసం పోరాడారని తెలిపారు. మువ్వెన్నెల జెండా భారతీయుల ఆత్మవిశ్వాసానికి ప్రతీక అని పేర్కొన్నారు. జాతీయ జెండా రూపకల్పనకు ప్రేరణగా నిలిచిన పింగళి వెంకయ్య, స్వాతంత్ర్యోద్యమ స్ఫూర్తిని అందించిన టంగుటూరి ప్రకాశం పంతులు వంటి మహనీయులు మనకు స్ఫూర్తి అని అన్నారు. ఎన్టీఆర్ జిల్లాలో జెండా ఎగురవేయడం ఆనందంగా ఉంది తన తాత, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు నడయాడిన జిల్లాలో జాతీయ పతాకాన్ని ఎగురవేయడం తనకు ఎంతో ఆనందంగా ఉందని నారా లోకేష్ అన్నారు. ఈ ప్రాంత అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. స్వర్ణాంధ్ర లక్ష్యాలకు అనుగుణంగా ఎన్టీఆర్ జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలని ఆకాంక్షించారు. విద్యా రంగంలో అనేక సంస్కరణలు విద్యాశాఖ మంత్రిగా పనిచేస్తున్న

య వత ఇతర ర ష ట ర లక వ ళ ల ద ద మన అమర వత Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in