యూట్యూబర్ రావణ్ కేసులో కొడాలి నానికి షాక్
Actor ProfilePolitician

యూట్యూబర్ రావణ్ కేసులో కొడాలి నానికి షాక్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
యూట్యూబర్ రావణ్ కేసులో కొడాలి నానికి షాక్
SkyC Media22 Oct 2026
యూట్యూబర్ రావణ్ కేసులో కొడాలి నానికి షాక్

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో యూట్యూబర్ ప్రశ్న రావణ్ అరెస్టు వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా యాక్టివిస్ట్ బచ్చలకూరి జోసెఫ్ అలియాస్ ప్రశ్న రావణ్ అరెస్టుపై మాజీ మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు ఆయనకు పెద్ద సమస్యగా మారాయి. విజయవాడ వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో కొడాలి నానిపై ఒక వ్యక్తి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. చట్టాలను హేళన చేస్తూ కొడాలి నాని మాట్లాడటంపై పాలక కూటమి నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ప్రశ్న రావణ్ గత కొన్ని సంవత్సరాలుగా సోషల్ మీడియా వేదికగా రాజకీయ వ్యాఖ్యలు చేస్తూ గుర్తింపు పొందారు. ఆయన ముఖ్యంగా దళిత సమావేశాలలో ప్రసంగిస్తూ ప్రభుత్వంపై, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌పై తీవ్ర విమర్శలు చేశారు. జూన్ 28న ఏలూరులో జరిగిన ఒక సమావేశంలో ఆయన చేసిన వ్యాఖ్యల ఆధారంగా జనసేన నేత గరికిపాటి శివశంకర్ గన్నవరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు జూన్ 30న హైదరాబాద్‌లో రావణ్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ అరెస్టు తర్వాత రావణ్‌కు ఒక కేసులో బెయిల్ వచ్చినా పోలీసులు తక్షణమే మరో కేసులో అరెస్టు చేశారు. దీంతో వరుసగా ఐదోసారి ఆయనపై అన్‌లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి జూలై 6న గన్నవరం కోర్టులో ప్రవేశపెట్టారు. కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించడంతో జైలుకు తరలించారు. ఇదిలా ఉండగా ఆయనపై మావోయిస్ట్ ఐడియాలజీ ప్రచారం, రాజ్య వ్యతిరేక వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో పాటు ఫోన్ లో అనుచిత వీడియోలు ఉన్నాయనే అంశాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ కఠిన చట్టాల అమలుపై వైఎస్‌ఆర్‌సీపీ నేత కొడాలి నాని స్పందిస్తూ ప్రభుత్వం కొత్త చట్టాలను ఉప్మా యాక్ట్, ఇడ్లీ యాక్ట్ అని హేళనగా అభివర్ణించారు. రావణ్ గతంలో వైఎస్‌ఆర్‌సీపీపై విమర్శలు చేసినా తాము ఇలాంటి అణచివేత చర్యలకు పాల్పడలేదని ఆయన స్పష్టం

య ట య బర ర వణ క స ల క డ ల న న క ష క Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in