UAE Free Visa For Indians : భారత్ నుంచి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) సందర్శనకు వెళ్లే పర్యాటకులకు ఆ దేశ ప్రభుత్వం అదిరిపోయే తీపి కబురు అందించింది. భారతీయ ప్రయాణికులను మరింతగా ఆకర్షించేందుకు, పర్యాటక రంగాన్ని ప్రోత్సహించేందుకు ఉచిత వీసా సదుపాయాన్ని కల్పిస్తున్నట్లు యూఏఈ యంత్రాంగం సంచలన ప్రకటన చేసింది. ఈ ప్రత్యేక వెసులుబాటు ద్వారా భారత్ నుంచి వచ్చే పర్యాటకులు వీసా రుసుము చెల్లించాల్సిన అవసరం లేకుండానే ఎమిరేట్స్‌లో పర్యటించే అవకాశాన్ని పొందుతారు.ఉచిత వీసా పొందడానికి నిబంధనలు ఇవే..!ఈ ఉచిత వీసా ఆఫర్‌ను పొందడానికి యూఏఈ పర్యాటక శాఖ కొన్ని ప్రాథమిక అర్హత నిబంధనలను ఖరారు చేసింది. యూఏఈ పర్యాటక శాఖచే అధికారిక ఆమోదం పొందిన పర్యాటక భాగస్వాముల ద్వారా లేదా గుర్తింపు పొందిన ఆన్‌లైన్ రవాణా సంస్థల ద్వారా తమ ప్రయాణ టికెట్లను బుక్ చేసుకున్న వారికి మాత్రమే ఈ ప్రయోజనం అందుతుంది. ఎమిరేట్స్ పర్యటనలో భాగంగా అబుదాబీలోని హోటళ్లలో వరసగా కనీసం మూడు రాత్రులు బస చేసేలా ప్రణాళికలు రూపొందించుకున్న ప్రయాణికులకు మాత్రమే ఈ ఉచిత వీసా వెసులుబాటు వర్తిస్తుంది.ఎప్పటి వరకు అందుబాటులో ఉంటుంది?భారతదేశ పాస్‌పోర్టు కలిగి ఉన్న పౌరులందరికీ ఈ ఉచిత వీసా ఆఫర్ అందుబాటులో ఉంటుందని యూఏఈ స్పష్టం చేసింది. అయితే ఈ ప్రత్యేక సదుపాయం అక్టోబరు 31వ తేదీ వరకు అమల్లో ఉంటుందని అధికారులు వివరించారు. యూఏఈలో పర్యటించాలని యోచిస్తున్న భారతీయ కుటుంబాలు, పర్యాటకులకు ఈ ఆఫర్ ద్వారా ప్రయాణ ఖర్చులు గణనీయంగా తగ్గడమే కాకుండా.. అబుదాబీలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలను సందర్శించే చక్కని అవకాశం లభిస్తుంది.పర్యాటక రంగానికి ఊతం!యూఏఈ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల భారత్ నుంచి అబుదాబీకి వెళ్లే పర్యాటకుల సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. పర్యాటక శాఖ గుర్తింపు పొందిన సంస్థల ద్వారా పారదర్శకంగా టికెట్లు, హోటళ్లు బుక్ చేసుకోవడం ద్వారా ఎలాంటి అదనపు
Actor ProfilePolitician
యూఏఈ వెళ్లే భారతీయులకు బంపర్ ఆఫర్.. ఉచితంగా వీసా పొందే అవకాశం.. అప్పటి వరకే ఛాన్స్
📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
Samayam Telugu•7 Dec 2026
యూఏఈ వెళ్లే భారతీయులకు బంపర్ ఆఫర్.. ఉచితంగా వీసా పొందే అవకాశం.. అప్పటి వరకే ఛాన్స్