
కలెక్షన్ కింగ్‌గా రాణించిన మోహన్ బాబు ఇప్పుడు కొంత గ్యాప్‌తో క్యారెక్టర్స్ చేస్తున్నాడు. నాని `పారడైజ్`లో విలన్‌గా మరోసారి రీఎంట్రీ ఇస్తున్నారు. ఈ సినిమా ఆగస్ట్ లో రానుంది. మోహన్ బాబు తన కెరీర్‌లో విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, హీరోగా ఐదు వందలకుపైగా చిత్రాలు చేశారు. తిరుగులేని స్టార్‌గా రాణించారు. అద్భుతమైన నటుడిగా మెప్పించారు. ఆయన డైలాగ్ డెలివరీ చాలా స్పెషల్ అని చెబితే అతిశయోక్తి కాదు. డైలాగ్ డెలివరీలో ఎన్టీఆర్ తర్వాత ఆ స్థాయి కమాండ్ ఉన్న నటుడిగా మోహన్ బాబు పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు మళ్లీ విలన్‌గా సందడి చేయబోతున్న మోహన్‌బాబు తాను నటించిన సినిమాలకు సంబంధించిన ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. ప్రతి ఒక్క నటుడు, హీరో కెరీర్‌లో మంచి సినిమాలుంటాయి, చెత్త సినిమాలుంటాయి. అయితే అత్యంత చెత్త సినిమాలు కూడా ఉంటాయి. అలా ఏదో ఒక మూవీని చెత్త సినిమాగా భావిస్తుంటారు. మోహన్ బాబు ఈ విషయంపై స్పందించారు. తాను చేసిన చిత్రాల్లో చెత్త మూవీ ఏంటో వెల్లడించారు. తాను చూసుకోవడానికి కూడా ఇష్టపడనని చెప్పారు. అంతే కాదు ఆ సినిమా చేశాక తన భార్య వారం రోజులు తనతో మాట్లాడలేదట. అంటే అది ఏ రేంజ్‌లో చెత్తగా ఉందో అర్థం చేసుకోవచ్చు. మరి ఆ సినిమా ఏంటనేది చూస్తే, మోహన్ బాబు తన చెత్త సినిమా గురించి చెబుతూ, `పటాల పాండు` అనే మూవీ తాను నటించిన చిత్రాల్లో అత్యంత రాడ్డు రంభోలా మూవీ అని చెప్పారు. ఈ సినిమా చూసి తన భార్య నిర్మల వారం రోజులు మాట్లాడలేదని చెప్పారు. అలాంటి ఘోరాతి ఘోరమైన మూవీ అని చెప్పారు మోహన్ బాబు. బాలకృష్ణ హోస్ట్ గా చేసిన అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే టాక్ షోలో పాల్గొన్న ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. తనతో నటించిన వారిలో తనకు నచ్చని వారు ఎవరనే ప్రశ్న బాలయ్య