మిస్టర్ షోఆఫ్ అన్న రష్మిక.. యష్ స్ట్రాంగ్ ఆన్సర్ ఇదే
Actor ProfileActor

మిస్టర్ షోఆఫ్ అన్న రష్మిక.. యష్ స్ట్రాంగ్ ఆన్సర్ ఇదే

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
మిస్టర్ షోఆఫ్ అన్న రష్మిక.. యష్ స్ట్రాంగ్ ఆన్సర్ ఇదే
Zee Telugu30 Dec 2026
మిస్టర్ షోఆఫ్ అన్న రష్మిక.. యష్ స్ట్రాంగ్ ఆన్సర్ ఇదే

Rashmika Mandanna vs Yash: కన్నడ స్టార్ హీరో యష్, హీరోయిన్ రష్మిక మందన్నకు సంబంధించిన పాత కామెంట్‌పై తాజాగా స్పందించారు. రష్మిక కెరీర్ ప్రారంభంలో చేసిన ఈ వ్యాఖ్య అప్పట్లో పెద్ద చర్చకు దారితీసింది. చాలా సంవత్సరాల తర్వాత ఈ విషయంపై యష్ మాట్లాడటంతో మరోసారి వార్తల్లోకి వచ్చింది. రష్మిక 2017లో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో కన్నడ ఇండస్ట్రీలో ‘మిస్టర్ షోఆఫ్’ ఎవరు అని అడిగినప్పుడు యష్ పేరు చెప్పింది. ఆ సమయంలో ఆమె ఇండస్ట్రీలో కొత్తగా ఎదుగుతున్న హీరోయిన్. రష్మిక చేసిన ఈ వ్యాఖ్య యష్ అభిమానులకు నచ్చలేదు. సోషల్ మీడియాలో ఆమెపై తీవ్ర స్థాయిలో విమర్శలు కూడా వచ్చాయి.ఇటీవల యష్, ప్రముఖ జర్నలిస్ట్ రజత్ శర్మ నిర్వహించే ‘ఆప్ కీ అదాలత్’ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రష్మిక చేసిన పాత కామెంట్ గురించి యష్‌ను ప్రశ్నించారు. దీనికి యష్ చాలా ప్రశాంతంగా సమాధానం ఇచ్చారు. రష్మిక ఆ మాట ఏ ఉద్దేశంతో చెప్పిందో తనకు తెలియదని యష్ అన్నారు. ఆమె అప్పటికి కొత్తగా ఇండస్ట్రీలోకి వచ్చిందని గుర్తు చేశారు. కొన్ని టీవీ కార్యక్రమాల్లో యాంకర్లు ఒక ప్రశ్నకు మూడు లేదా నాలుగు ఆప్షన్లు ఇస్తారని, అందులో ఒకదాన్ని ఎంచుకునే సమయంలో అలా జరిగి ఉండొచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే ఎవరో ఒకరు తన గురించి ఏదైనా అభిప్రాయం చెప్పినంత మాత్రాన అది తన వ్యక్తిత్వాన్ని నిర్ణయించదని యష్ స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరికీ తమ అభిప్రాయాన్ని చెప్పే హక్కు ఉందని అన్నారు. తాను ఎవరో ఇతరుల అభిప్రాయాల వల్ల మారిపోనని తెలిపారు. అంతేకాదు, యష్ తన అభిమానులకు కూడా ఒక ముఖ్యమైన సందేశం ఇచ్చారు. ఇతర నటీనటులను అభిమానులు గౌరవించాలని చెప్పారు. మరో నటుడిని గౌరవించని వ్యక్తిని తాను తన అభిమానిగా భావించనని యష్ స్పష్టంగా చెప్పారు. అప్పట్లో వచ్చిన విమర్శల తర్వాత రష్మిక కూడా తన వ్యాఖ్యలపై