మౌలిక సదుపాయాల కల్పనకు కూటమి ప్రభుత్వం కృషి
Actor ProfilePolitician

మౌలిక సదుపాయాల కల్పనకు కూటమి ప్రభుత్వం కృషి

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
మౌలిక సదుపాయాల కల్పనకు కూటమి ప్రభుత్వం కృషి
Eenadu27 Nov 2026
మౌలిక సదుపాయాల కల్పనకు కూటమి ప్రభుత్వం కృషి

విజయనగరం రూరల్‌: గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి కొండ‌ప‌ల్లి శ్రీనివాస్ తెలిపారు. గజపతినగరం నియోజకవర్గం గంట్యాడ మండలం లక్కిడం గ్రామంలో రూ.1.07 కోట్లతో నిర్మించిన సీసీ రోడ్లు, డ్రైనేజీలను సోమవారం మంత్రి శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల సౌకర్యార్థం సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణాలు చేపట్టామన్నారు. వర్షాకాలం నేపథ్యంలో గ్రామస్థులు ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు, డ్రైనేజీల్లో మురుగునీరు నిలిచిపోకుండా చూసుకోవాలని సూచించారు. లక్కీడం గ్రామ అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తోందని, ప్రజలు కూడా ప్రభుత్వానికి సహకరించాలని మంత్రి శ్రీనివాస్ కోరారు. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు