మీరు తప్పుచేసి.. మా
Actor ProfilePolitician

మీరు తప్పుచేసి.. మా

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
మీరు తప్పుచేసి.. మాపై ఎదురుదాడా
Eenadu7 Oct 2026
మీరు తప్పుచేసి.. మాపై ఎదురుదాడా

కాళేశ్వరం కట్టిన ఏడాదికే బయటపడ్డ లోపాలు స్వయంగా ఇంజినీర్‌ లేఖ రాసినా.. పట్టించుకోలేదు అందుకే మూడేళ్లకే కూలేశ్వరం అయింది ఇది నిర్వాకం కాదు. విధ్వంసం మీరు చేసిన తప్పులకు.. ప్రజలకు శిక్ష పడొద్దు మరమ్మతు బాధ్యతలు మీకు ఎందుకు అప్పగించాలో వివరించాలి కేసీఆర్‌పై విరుచుకుపడ్డ సీఎం రేవంత్‌రెడ్డి సమావేశంలో మాట్లాడుతున్న సీఎం రేవంత్‌రెడ్డి ఈనాడు- హైదరాబాద్‌: ‘కేసీఆర్‌.. కాళేశ్వరంలో మీరు తప్పు చేశారు. కానీ మీ నేతలు మా ప్రభుత్వంపై ఎదురుదాడి చేస్తూ తప్పును మా మీద నెట్టి తప్పించుకొనే ప్రయత్నం చేస్తున్నారు. ఇది రాజకీయంగా మీ పార్టీ ఉనికిని కాపాడుకొనే ప్రయత్నమే తప్ప మరొకటి కాదు’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ధ్వజమెత్తారు. ‘‘మళ్లించే నీళ్లు పెరగలేదు. ఆయకట్టు పెరగలేదు. కానీ రూ.38 వేల కోట్ల ప్రాజెక్టు అంచనా కాస్తా.. రూ.1.47 లక్షల కోట్లు అయింది. ఇంత ఖర్చుచేసినా ప్రాజెక్టును నాణ్యతతో నిర్మించారా.. అంటే అదీ లేదు. డిజైన్లు, నిర్మాణంలో నాణ్యత పాటించి ఉంటే.. ఈరోజు ఇలా చర్చించుకునే అవకాశం ఉండేది కాదు. తానే డిజైన్‌ చేశానని కేసీఆర్‌ నాడు స్వయంగా చెప్పారు. మరి ఆయన మేధోశక్తి ఏమైంది? ఆయన ఆలోచనలన్నీ ఇందులో ఎంత కొల్లగొట్టాలనే ఉండడంతో.. దీన్ని ప్రారంభించిన ఏడాదికే మరమ్మతులు వచ్చాయి. ప్రాజెక్టు ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీరే మరమ్మతులు చేయకుంటే తీవ్ర నష్టం వాటిల్లుతుందని నిర్మాణ సంస్థ ఎల్‌అండ్‌టీకి లేఖ రాశారు. అయినా కేసీఆర్‌ ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో.. మూడేళ్లకే మేడిగడ్డ కుంగింది’’ అని సీఎం రేవంత్‌రెడ్డి విరుచుకుపడ్డారు. కూలిన కాళేశ్వరం: వైఫల్యం నుంచి పునర్నిర్మాణం వైపు అంటూ మంగళవారం ప్రజాభవన్‌లో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో ప్రజాప్రతినిధులకు అవగాహన కల్పించేందుకు ప్రజంటేషన్‌ ఇచ్చారు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరైన ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాట్లాడారు. ‘‘కేసీఆర్‌.. మీరు స్పీకర్‌కు లేఖ రాయండి. మీరు కోరుకున్నన్ని రోజులు అసెంబ్లీ నిర్వహిస్తాం. ఎందుకు మేడిగడ్డ మరమ్మతు బాధ్యతలు మీకు ఇవ్వాలో.. శాసనసభలో చెప్పండి. సభలో