మీర్జాపూర్ మూవీ ట్రైలర్ రిలీజ్
Actor ProfileCelebrity

మీర్జాపూర్ మూవీ ట్రైలర్ రిలీజ్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
మీర్జాపూర్ మూవీ ట్రైలర్ రిలీజ్
Eenadu7 Dec 2026
మీర్జాపూర్ మూవీ ట్రైలర్ రిలీజ్

ఇంటర్నెట్‌ డెస్క్: యాక్షన్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌ నేపథ్యంలో సాగే ఓటీటీలో పాపులారిటీ సొంతం చేసుకున్న ‘మీర్జాపూర్’ (Mirzapur).. ఇప్పుడు సినిమాగా రానున్న విషయం తెలిసిందే. ‘మీర్జాపూర్‌ ది మూవీ’ (Mirzapur The Movie) పేరుతో తెరకెక్కిన ఈ సినిమా సెప్టెంబర్‌ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా దీని ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్మాత ఫర్హాన్‌ అక్తర్ మాట్లాడుతూ.. ప్రేక్షకుల నుంచి వచ్చిన ఆదరణ వల్లే దీన్ని సినిమాగా రూపొందించాలనే ఆలోచన వచ్చినట్లు స్పష్టం చేశారు. ‘‘2018లో మొదటి సీజన్ విడుదలైనప్పటి నుంచే ప్రేక్షకులు దీనికి ఎంతో మద్దతుగా నిలిచారు. అమెజాన్ ప్రైమ్ దీనిని ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్ళింది. నేను ఎక్కడికి వెళ్లినా ‘మీర్జాపూర్’ కొత్త సీజన్ ఎప్పుడు వస్తుందని అందరూ నన్ను అడిగేవారు. సినిమా ప్రకటన వచ్చిన తర్వాత కూడా విడుదల తేదీ గురించి ఆరా తీశారు. నిజానికి అభిమానుల కోరిక మేరకే ఈ సినిమాను తీసుకొస్తున్నాం. పాత తారాగణంతో పాటు కొత్త నటీనటులతో కలిసి దీనిని రూపొందించినందుకు చాలా సంతోషంగా ఉంది’’ అని తెలిపారు. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు

మ ర జ ప ర మ వ ట ర లర ర ల జ Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in