మామిడికి ప్రత్యామ్నాయంగా ఈ పంట వేసుకోండి.. ప్రభుత్వం నుంచి మంచి సబ్సిడీ కూడా
Actor ProfilePolitician

మామిడికి ప్రత్యామ్నాయంగా ఈ పంట వేసుకోండి.. ప్రభుత్వం నుంచి మంచి సబ్సిడీ కూడా

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
మామిడికి ప్రత్యామ్నాయంగా ఈ పంట వేసుకోండి.. ప్రభుత్వం నుంచి మంచి సబ్సిడీ కూడా
Samayam Telugu19 Nov 2026
మామిడికి ప్రత్యామ్నాయంగా ఈ పంట వేసుకోండి.. ప్రభుత్వం నుంచి మంచి సబ్సిడీ కూడా

ఒకే పంటను ఎక్కువ కాలం సాగు చేస్తే ఆ దిగుబడి తగ్గుతుంది. ఇది రైతులందరికీ తెలిసిన నిజమే. చిత్తూరు జిల్లాలో మామిడి పంట ఎక్కువగా సాగు చేస్తారు. మామిడి సాగు పెరగడం, వర్షాలు లేకపోవడం.. తెగుళ్లు రావడంతో ఇటీవల కాలంలో నష్టాలు మొదలయ్యాయి. అయితే, ఆ నష్టాలు పూడవాలంటే ఆయిల్ పామ్ సాగు చేయాలంటూ అధికారులు చెబుతున్నారు. అయిల్ పామ్ సాగు విస్తరణ పెంచాలని ప్రభుత్వం చూస్తోంది.. దానిలో భాగంగానే ఉద్యాన శాఖ అధికారులు ఈ పంటపై ఎక్కువ అవగాహన కూడా కల్పిస్తున్నారు. చిత్తూరు జిల్లాలోని ఆరు మండలాల్లో ఆయిల్ పామ్ సాగును ఉద్యానశాఖ అధికారులు ప్రయోగాత్మకంగా ప్రారంభించారు. ఈ ఆయిల్ పామ్ సాగు పర్యావరణానికి కూడా మేలు చేకూరుస్తుందని అధికారులు అంటున్నారు. ఈ మొక్కను ఒకసారి నాటితే 30 ఏళ్ల వరకూ దిగుబడులు వస్తాయని అంటున్నారు. పెట్టుబడి తక్కువగా ఉంటుందని.. మూడేళ్ల తర్వాత లాభాలు రావడం మొదలవుతుందని చెబుతున్నారు. READ ALSO ఏడో నెలలోనే పుట్టిన బిడ్డ.. ప్రాణమే లేకుండా శిశువు.. దేవుడిలా 108 సిబ్బందిగంగాధర నెల్లూరు, నిండ్ర, నగరి, కార్వేటినగరం, విజయపురం, ఎస్ఆర్‌పురం మండలాలతో మూడు కంపెనీలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. రైతులను ప్రోత్సహించి, వారికి పరికరాలతో పాటు గోద్రేజ్, ఎఫ్ 3, పంట కొనుగోలుకు కావాల్సినవన్నీ కంపెనీలే ఇస్తున్నాయి. ఈ ఏడాది 800 హెక్టార్లలో సాగు విస్తరణ లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఇప్పటి వరకు 345 హెక్టార్లలో రైతులను గురించి 60 హెక్టార్లలో మొక్కలు నాటారు. ఎకరా తోటకు రూ. 30 వేల నుంచి రూ. 40 వేలు ఖర్చు అవుతుంది. 15 టన్నుల వరకు దిగుబడి వచ్చినా 2500 కిలోల నూనె ఉత్పత్తి అవుతుంది.ఆయిల్ పామ్ పంటకు ప్రభుత్వం నుంచి కూడా రాయితీలు వస్తున్నాయి. హెక్టారుకు 143 - 150 చెట్లు నాటాల్సి ఉంటుంది. ఒక్కో రైతుకు గరిష్టంగా 25 ఎకరాల వరకు మొక్కలు ఉచితంగా ఇస్తారు. సాగు నిర్వహణ ఖర్చుల