
కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. Mumbai Landsides: దేశ ఆర్ధిక రాజధాని ముంబైను వరుణ దేవుడు ఒదలడం లేదు. గత కొన్ని రోజులుగా ఆర్ధిక రాజధానిలో ఎడతెరిపు లేకుండా కురిసిన భారీవర్షాలకు నగరమంతా తడిసి ముద్దయింది. వర్షాల కారణంగా నగరమంతా స్తంభించిపోయింది. ముంబై పూణే పరిధిలో పలు చోట్ల తీవ్ర నష్టం వాటిలింది. పలు రైల్వే సర్వీసులకు తీవ్ర అంతరాయం కలిగింది. పూణే- ముంబై హైవేలో కొండ చరియలు విరిగపడి రైల్వే ట్రాకులు బురద రాళ్లతో కూరుకుపోయాయి. కొన్ని చోట్ల వరదలకు పట్టాలు కొట్టుకుపోయాయి. ఎక్స్‌ప్రెస్ వే చెరువులా మారింది. ఒక్కసారిగా కురిసిన భారీ వర్షాలకు 16 మందికి పైగా చనిపోయినట్టు అధికారులు ప్రకటించారు. ముంబైలో మరో రెండు రోజులు పాటు భారీ వర్షాలు.. మరో రెండు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో అధికారులు అలర్ట్ అయ్యారు.ఇక భారీ వర్షాల కారణంగా ముంబై నగరంలో లోతట్టు ప్రాంతాల్లోని పలు కాలనీలు నీటమునగాయి. దీంతో పాఠశాలలు, కళాశాలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. వర్షాలు తగ్గే వరకు విద్యార్ధులెవరు స్కూళ్లకు రావొద్దని చెబుతున్నారు. ఆన్ లైన్ క్లాసులకు హాజరు కావాలని సూచించారు. మరోవైపు వర్షాల కారణంగా పలు చోట్ల విద్యుత్ వ్యవస్థ దెబ్బతినడంతో పాటు ఇంటర్నెట్ సేవలు పలు ప్రాంతాల్లో అందుబాటులో లేకపోవడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు విద్యుత్, ఇతర ఎమర్జన్సీ సిబ్బంది ఎప్పటికపుడు యుద్ద ప్రాతిపదికన చేస్తోన్న పనులు సకాలంలో కావడం లేదు