ముంబయిలో భారీ వర్షాలు.. విరిగిపడిన కొండచరియలు
Actor ProfilePolitician

ముంబయిలో భారీ వర్షాలు.. విరిగిపడిన కొండచరియలు

📊 Box Office Collections
Total News3
Movie Updates0
Sources1
జమ్మూకశ్మీర్ లో క్లౌడ్ బరస్ట్
Eenadu26 Sept 2026
జమ్మూకశ్మీర్ లో క్లౌడ్ బరస్ట్

ఇంటర్నెట్‌ డెస్క్‌: జమ్మూకశ్మీర్‌లోని కిశ్త్‌వాడ్‌లో మేఘ విస్ఫోటం (Cloudburst in Kishtwar) సంభవించింది. ఆకస్మిక వరదలతో రోడ్లు బురదమయమయ్యాయి. భారీ వర్షాలకు కొండ చరియలు విరిగి పడి అనేక ప్రాంతాల్లో

ఎక్కువ మంది కొనసాగింపునకు సైన్యం ఆసక్తి
Eenadu25 Sept 2026
ఎక్కువ మంది కొనసాగింపునకు సైన్యం ఆసక్తి

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘అగ్నిపథ్’ పథకం కింద నాలుగేళ్ల పదవీకాలం పూర్తయ్యాక శాశ్వత ప్రాతిపదికన కొనసాగించే అగ్నివీర్‌ల (Agniveers) సంఖ్యను పెంచాలని భారత సైన్యం (Indian Army) భావిస్తోంది. ఇందులో భాగంగా

ముంబయిలో భారీ వర్షాలు.. విరిగిపడిన కొండచరియలు
Eenadu25 Sept 2026
ముంబయిలో భారీ వర్షాలు.. విరిగిపడిన కొండచరియలు

ఇంటర్నెట్‌డెస్క్‌: మహారాష్ట్రను భారీ వర్షాలు ముంచెత్తున్నాయి. ఎడతెరిపిలేకుండా కురుస్తోన్న వానలకు కొండచరియలు విరిగిపడటంతో పుణె-ముంబయి ఎక్స్‌ప్రెస్‌వే (Pune-Mumbai Expressway), ఓల్డ్‌ ముంబయి-పుణె హైవేపై రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ మార్గాల్లో పూర్తిగా ట్రాఫిక్‌ను నిలిపివేశామని, తదుపరి నోటీసులు వచ్చేవరకు ఇటుగా ప్రయాణించవద్దని మహారాష్ట్ర స్టేట్ రోడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ వెల్లడించింది. ఎప్పటికప్పుడు ట్రాఫిక్ అడ్వైజరీలను గమనించుకోవాలని సూచించింది. ఈ వర్షాలతో రోడ్డు మార్గంతో పాటు రైలు నెట్‌వర్క్‌ ప్రభావితమైంది. సోమవారం నడవాల్సిన 16 రైళ్లు నిలిచిపోయాయి. అటు విమాన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రానున్న గంటల్లో ముంబయి, ఠాణె, నవీ ముంబయి, పాల్ఘర్‌లో ఈదురుగాలులతో కూడిన భారీ, అతిభారీవర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ మేరకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. దాంతో ఈ జిల్లాల్లోని పాఠశాలలకు ప్రభుత్వం సోమవారం సెలవు ప్రకటించింది. మన్‌కుర్ద్‌ ప్రాంతంలో ఆదివారం రాత్రి నివాస భవనం కూలి ఆరుగురు మృతి చెందారు. వారిలో ఐదుగురు చిన్నారులు ఉన్నారు. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు

మ బయ ల భ ర వర ష ల వ ర గ పడ న క డచర యల Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in