
సల్మాన్ ఖాన్, టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి కాంబినేషన్‌లో టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు నిర్మిస్తోన్న ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌కు టైటిల్ ఫిక్స్ అయినట్లుగా సమాచారం. బాలీవుడ్ భాయ్‌జాన్ సల్మాన్ ఖాన్ (Salman Khan), టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి (Vamshi Paidipally) కాంబినేషన్‌లో టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ (SVC) బ్యానర్‌పై దిల్ రాజు నిర్మిస్తోన్న ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ #SVC63. పాన్ ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా టైటిల్‌కు సంబంధించి ఫిలింనగర్ సర్కిల్స్‌లో క్రేజీ న్యూస్ చక్కర్లు కొడుతోంది. ఈ హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌కు ‘మాన్‌స్టర్’ (Monster) అనే పవర్‌ఫుల్ టైటిల్‌ను ఖరారు చేసినట్లు సమాచారం. ఈ టైటిల్ వింటేనే బాక్సాఫీస్ వద్ద తొలిరోజే రూ. 100 కోట్ల ఓపెనింగ్స్ రాబట్టే రేంజ్ వైబ్స్ వస్తున్నాయని ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు. ఈ చిత్రాన్ని ఈద్ 2027 కానుకగా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా టీజర్‌కు సంబంధించి సినీ ప్రియుల మైండ్ బ్లాంక్ అయ్యే మరో బిగ్ అప్‌డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సూపర్ స్టార్ రజనీకాంత్ (Super Star Rajinikanth) నటిస్తోన్న మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ ‘జైలర్ 2’ (Jailer 2) థియేట్రికల్ ప్రింట్లకు సల్మాన్ ఖాన్ ‘మాన్‌స్టర్’ టీజర్‌ను అటాచ్ చేయబోతున్నట్లు గట్టిగా ప్రచారం సాగుతోంది. ఒకవైపు బిగ్ స్క్రీన్‌పై రజనీకాంత్ విధ్వంసం, దానికి తోడు సల్మాన్ ఖాన్ ‘మాన్‌స్టర్’ టీజర్ జతకలిస్తే థియేటర్లలో బాక్సాఫీస్ సునామీ రావడం ఖాయమని సినీ లవర్స్, ట్రేడ్ పండితులు అభిప్రాయపడుతున్నారు. దేశంలోనే ఇద్దరు అతిపెద్ద మెగాస్టార్ల మాస్ పవర్ ఒకేసారి థియేటర్లలో కనిపించనుండటం సినీ వర్గాల్లో అంచనాలను తారాస్థాయికి చేర్చింది. ఈ సినిమాలో లేడీ సూపర్ స్టార్ నయనతార కథానాయికగా నటిస్తుండటంతో నార్త్, సౌత్ అనే తేడా