
ఫిల్మ్ ఇండస్ట్రీలో గత 40 ఏళ్లుగా కొనసాగుతున్న హీరోయిన్లలో మీనా ఒకరు. ఆమె 50 ఏళ్లకు అడుగుదూరంలో ఉన్నారు. మీనా సినీ ప్రయాణంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు. బాలనటిగా అరంగేట్రం చేసిన ఆమె.. ఆతర్వాత స్టార్ హీరోయిన్‌గా పలు భాషల్లో దూసుకుపోయింది. సౌత్ లో దాదాపు స్టార్ హీరోలందరితో జంటగా నటించి మెప్పించింది మీనా. తెలుగులో చిరంజీవి, బాలయ్య, వెంకీ, నాగార్జున, తమిళంలో రజినీకాంత్, కమల్, శరత్ కుమార్, మలయాళంలో మోహన్ లాల్, మమ్ముట్టి లాంటి స్టార్స్ తో నటించింది మీనా. ఇప్పటికీ ఆమె హీరోయిన్ గానే కొనసాగుతోంది. క్యారెక్టర్ రోల్స్ కు ఇష్టపడటంలేదు. దృశ్యంలాంటి సినిమాలతో సత్తా చాటుతోంది. గతంలో జరిగిన ఒక ఇంటర్వ్యూలో సుహాసినితో మాట్లాడుతూ.. మీనా తన జీవితానికి సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలను, గతంలో తనకు ఉన్న క్రష్ గురించి వెల్లడించారు. బాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో హృతిక్ రోషన్ అంటే తనకు ఎంతో ఇష్టమని ఆమె అన్నారు. హృతిక్ రోషన్ తెరపై కనిపించిన సమయం నుంచే తనకు ఆయనపై అమితమైన అభిమానం ఉండేదని తెలిపారు. పెళ్లి చేసుకుంటే హృతిక్ లాంటి వ్యక్తినే వివాహం చేసుకోవాలని తన తల్లితో చెప్తుండేదట మీన. హృతిక్ పెళ్లి జరుగుతుందని తెలిసి మీనా హృదయం ఒక్కసారిగా ముక్కలైపోయిందట, "తీవ్రమైన మనస్తాపానికి గురయ్యి.. ఏడ్చేశాను'' అని మీనా చెప్పినట్టు సమాచారం. అప్పటికి మీనాకు కూడా వివాహం కాలేదు. ఈ సందర్భంగా తన కెరీర్‌కు సంబంధించిన మరికొన్ని ఆసక్తికరమైన విషయాలను కూడా మీనా షేర్ చేసుకున్నారు. రజనీకాంత్ బ్లాక్‌బస్టర్ హిట్ చిత్రం 'పడయప్ప' (తెలుగులో 'నరసింహా') లో రమ్యకృష్ణ పోషించిన విలన్ క్యారెక్టర్ (నీలాంబరి) కి మొదట మీనానే సంప్రదించారట. అయితే.. స్టార్ హీరోయిన్‌గా కొనసాగుతున్న సమయంలో ఇలా విలన్ క్యారెక్టర్ చేస్తే.. కెరీర్‌పై ప్రభావం పడుతుందనే ఉద్దేశంతో ఆమె తల్లి ఆ ఆఫర్‌ను తిరస్కరించారట. దాంతో తల్లి మాటమీద ఆ అవకాశాన్ని వదులుకోవాల్సి