
మృతదేహం ఉన్న ఇంటి వద్ద పోలీసు వాహనాలు, స్థానికులు ఒకటి రెండు రోజులు కాదు.. ఏడాదిగా ఆ ఇంటి తలుపులు తెరుచుకోకపోయినా.. చుట్టుపక్కల వారికి పట్టినట్లు లేదు. చివరికి బంధువులూ ఆ ఇంటి వైపు తొంగిచూడలేదు. అనాథలా కొట్టుమిట్టాడిన ఆ ఇంటి పెద్దామె ఏమైపోయిందనే ప్రశ్న కూడా ఏ మూలనా ఉదయించకపోవడదంతో ఆమె జీవనయాత్ర ముగిసింది. బెంగళూరు (గ్రామీణం), న్యూస్‌టుడే: రాజధాని నగర హావనూరు లేఅవుట్లో ఏడాదిగా తలుపులు మూసి ఉన్న ఇంట్లో దాక్షాయిణి (52) అనే మహిళ అస్థిపంజరాన్ని బాగలగుంటె ఠాణా పోలీసులు గుర్తించారు. ఇన్ని రోజులు మూసిన ఇంటి తలుపు శుక్రవారం రాత్రి 8 గంటలకు తెరచి ఉండడాన్ని గుర్తించిన, స్థానికులు ఇచ్చిన ఫిర్యాదుతో అక్కడకు వచ్చిన పోలీసులు, ఇంట్లోకి వెళ్లి చూడగా ఎముకల గూడు కనిపించింది. ఆమె భర్త ఉమేశ్ పదేళ్ల కిందట అనారోగ్యంతో మరణించారు. ఆ తరువాత కుమారుడు కూడా క్యాన్సర్‌తో కన్నుమూశారు. అప్పటి నుంచి ఆమె ఇంట్లో ఒంటరిగా ఉంటున్నారు. మానసిక అనారోగ్య సమస్యలు ఎదుర్కొన్న ఆమెకు బెంగళూరు, శివమొగ్గ ఆసుపత్రుల్లో సోదరుడు మహేశ్ బసప్ప చికిత్స ఇప్పించారు. ఆపై ఇటు వచ్చిన దాఖలాలు లేవు. ఆమె స్కిజోఫ్రేనియా సమస్యతో ఇబ్బంది పడుతున్నట్లు అప్పట్లో గుర్తించారు. రెండేళ్లుగా సోదరుడు, ఇతర బంధువులతో మాట్లాడకుండా, ఇంట్లోనే ఉండేది. ఏడాది నుంచి ఇంటి తలుపు వేసి ఉన్నా, ఎవరూ ఆమె వివరాలు, పరిస్థితులను తెలుసుకునేందుకు ఆసక్తి చూపించలేదు. తన సోదరి మృతికి సంబంధించి తమకు ఎటువంటి అనుమానం లేదని మహేశ్ బసప్ప తెలిపారు. మరణోత్తర పరీక్షల నిమిత్తం మృతదేహాన్ని యలహంక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అంతటి దేహం ఇంతైంది.. అంబులెన్సులో ఎముకల మూట గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి