
బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 లో సామాన్యులను బిగ్ బాస్ హౌస్‌లోకి పంపించే ప్రయత్నంలో భాగంగా.. 'అగ్నిపరీక్ష సీజన్ 2' రసవత్తరంగా కొనసాగుతోంది. ఈ క్రమంలో తమ టాలెంట్‌ను నిరూపించుకోవడానికి వచ్చిన వారిలో ఇప్పటికే కొంతమంది సెకండ్ రౌండ్ వరకు వెళ్లగా, ముగ్గురు జడ్జిల నుంచి గ్రీన్ కార్డ్ సాధించి ఫైనల్స్‌కు చేరిన వారు ముగ్గురు ఉన్నారు. ఇక ఆ ముగ్గురితో పోటీ పడటానికి ఇప్పటి వరకు హోల్డ్‌లో ఉన్న 26 మంది నుంచి మరో 8 మందిని ఏకాభిప్రాయంతో ఎలిమినేట్ చేశారు. దాంతో హోల్డ్‌లో ఉన్న టీమ్ సంఖ్య 18కి చేరింది. తాజా ఎపిసోడ్‌లో జ్యోత్స్నా రెడ్డి, ఫుతా (జపాన్), అభిజ్ఞ, హేమంత్, ప్రియాంక ఐదుగురు తమ టాలెంట్‌ను చూపించుకునే ప్రయత్నం చేశారు. ఇందులో చాలా ఆసక్తికరంగా అనిపించింది జపాన్ నుంచి వచ్చిన ఫుతా మాత్రమే. ఫుతా జపాన్ దేశానికి చెందిన వ్యక్తి అయినప్పటికీ, ఆయనకు తెలుగు అంటే చాలా అభిమానం. చాలా కాలంగా తెలుగు నేర్చుకుంటూ.. జపాన్, తెలుగు మిక్సింగ్ వీడియోలు కూడా చేస్తున్నాడు. సోషల్ మీడియాలో చాలా పాపులర్ అయ్యాడు. తెలుగు పాటలకు డ్యాన్స్ చేస్తూ, తెలుగు సినిమా డైలాగ్స్ కూడా చెప్తుంటాడు. తనను తాను ఒక మ్యూజిషియన్‌గా పరిచయం చేసుకున్నాడు ఫుతా. అయితే తెలుగు సరిగ్గా రాని కారణంగా హౌస్‌లో సర్వైవ్ అవ్వలేడని మిగతా జడ్జెస్ రిజెక్ట్ చేయగా, అభిజిత్ మాత్రమే అతనికి గ్రీన్ కార్డ్ ఇచ్చి ఫైనల్ రౌండ్‌కు పంపించాడు. ఈ ఎపిసోడ్‌లో ఇద్దరు కంటెస్టెంట్లు ఫాదర్ సెంటిమెంట్‌తో కంటతడి పెట్టించారు. ముందుగా జ్యోత్స్నా రెడ్డి చాలా జోష్‌తో వచ్చి, మధ్యలో తండ్రి జ్ఞాపకాలతో ఎమోషనల్ అయ్యారు. తన తండ్రి తనను ఎంత ప్రేమిస్తారో, ఆయనకు బిగ్ బాస్ అంటే ఎంత ఇష్టమో చెప్పి అందరి దృష్టిని ఆకర్షించారు. సడెన్‌గా తన తండ్రి మరణం గురించి చెబుతూ, ఆయన వాయిస్ ఎక్కడ మర్చిపోతానో అని ఆమె