
ఇంటర్నెట్ డెస్క్: అమెరికా కంపెనీ ఆంథ్రోపిక్ ఏఐ రంగంలో సంచలనాలు సృష్టిస్తోంది. సంస్థల సాఫ్ట్‌వేర్‌లో లోపాలను గుర్తించి, సైబర్ భద్రతను మెరుగుపరచడానికి ఆ సంస్థ మిథోస్ ఏఐ (Artificial Intelligence) మోడల్‌ను రూపొందించింది. అమెరికా సైబర్ రక్షణ సంస్థ (CISA) ప్రభుత్వ సాఫ్ట్‌వేర్‌ను ఆడిట్ చేయడానికి ఏప్రిల్ నుంచి మిథోస్ (Mythos)ను ఉపయోగిస్తున్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. విదేశీ గూఢచారులు, సైబర్ నేరగాళ్లు సాఫ్ట్‌వేర్‌లో చొరబడడానికి వినియోగించే బగ్స్ కోసం.. ప్రభుత్వ కోడ్ రిపోర్ట్‌లను స్కాన్ చేయడానికి (US cyber agency) ఈ ఏఐ సాధనాన్ని వినియోగిస్తున్నట్లు తెలుస్తోంది. ఆడిట్‌లలో అధికారులు ఇప్పటికే పెద్ద సంఖ్యలో లోపాలను గుర్తించారని.. వాటిని చక్కదిద్దడానికి ప్రయత్నిస్తున్నారని సమాచారం. అయితే ఈ విషయాన్ని అమెరికా ప్రభుత్వం ధ్రువీకరించాల్సి ఉంది. అయితే.. ఫ్యాబిల్ 5, మిథోస్ 5 వంటి ఆంథ్రోపిక్ ఏఐ మోడళ్ల (Anthropic AI Tools) భద్రతపై అమెరికా ప్రభుత్వం గతంలో ఆందోళన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. వాటిని విదేశీ పౌరులకు నిషేధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఆంథ్రోపిక్‌లో పనిచేసే విదేశీ ఉద్యోగులకు కూడా ఈ మోడళ్ల యాక్సెస్ ఉండకూడదని పేర్కొంటూ మిథోస్, ప్యాబిల్‌లను బ్యాన్ చేసింది. వీటిపై సమీక్ష అనంతరం ఈ నెల ప్రారంభంలో ఆంక్షలను ఎత్తివేసింది. కాగా ప్రస్తుతం అవే సాధనాలను అక్కడి ప్రభుత్వం ఉపయోగిస్తుండడం గమనార్హం. ఈ విషయంపై ప్రశ్నించగా.. ఆంథ్రోఫిక్ (Anthropic) యాజమాన్యం నుంచి ఎలాంటి స్పందన లేదని అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. ఇదీ చదవండి: ట్రంప్ టపాసుల హడావుడి.. అత్యంత కాలుష్య నగరంగా వాషింగ్టన్ గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా