మంత్రి నిమ్మలను కలిలిన ఎమ్మెల్యే విజయశ్రీ
Actor ProfilePolitician

మంత్రి నిమ్మలను కలిలిన ఎమ్మెల్యే విజయశ్రీ

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
మంత్రి నిమ్మలను కలిలిన ఎమ్మెల్యే విజయశ్రీ
HMTV13 Jan 2027
మంత్రి నిమ్మలను కలిలిన ఎమ్మెల్యే విజయశ్రీ

Sullurpeta: మంత్రి నిమ్మలను కలిలిన ఎమ్మెల్యే విజయశ్రీ! Sullurpeta: తిరుపతి జిల్లా సూళ్ళూరుపేట నియోజకవర్గ పరిధిలోని కీలక సాగునీటి ప్రాజెక్టులు, అభివృద్ధి పనులపై స్థానిక శాసనసభ్యురాలు డాక్టర్ నెలవల విజయశ్రీ ప్రత్యేక దృష్టి సారించారు. నియోజకవర్గ రైతాంగ ప్రయోజనాలే ధ్యేయంగా పనిచేస్తున్న ఆమె, రాష్ట్ర నీటిపారుదల (జలవనరుల) శాఖ మంత్రి నిమ్మల రామానాయుడిని కలిసి సాగునీటి ప్రాజెక్టుల పురోగతిపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న పలు ప్రధాన నీటిపారుదల పనులైన మీజూరు చెక్‌డ్యామ్ నిర్మాణానికి అవసరమైన నిధులను తక్షణమే మంజూరు చేసి భూగర్భ జలమట్టం పెరిగేలా చర్యలు తీసుకోవాలని, తీరప్రాంతం మరియు నదీ పరివాహక ప్రాంత రక్షణకు ఉద్దేశించిన వాటంబేడు గ్రాయిన్ పనులను త్వరితగతిన చేపట్టాలని, ఆయకట్టు రైతులకు సమృద్ధిగా సాగునీరు అందించేందుకు చెంబేడు రిజర్వాయర్ పనులను పునరుద్ధరించి అవసరమైన బడ్జెట్ విడుదల చేయాలని వినతిపత్రం సమర్పించారు. ఈ మూడింటికి సంబంధించిన నిధుల విడుదల ప్రక్రియను వేగవంతం చేసి, పనులను సత్వరమే ప్రారంభించేలా సంబంధిత అధికారులను ఆదేశించాలని ఎమ్మెల్యే కోరగా, మంత్రి నిమ్మల రామానాయుడు సానుకూలంగా స్పందించారు. ఒక మహిళా ప్రజాప్రతినిధిగా నియోజకవర్గంలోని ప్రతి చిన్న సమస్యపైనా ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ నిరంతరం సమీక్షలు నిర్వహిస్తున్నారు. నీటిపారుదల శాఖతో పాటు అన్ని శాఖల ఉన్నతాధికారులతో నేరుగా మాట్లాడుతుండటంతో పాటు, క్షేత్రస్థాయికి వెళ్లి సమస్యలను తెలుసుకుని పరిష్కార దిశగా చర్యలు తీసుకుంటున్నారు. ప్రజా సమస్యల పట్ల ఆమె చూపుతున్న చొరవ, నియోజకవర్గ అభివృద్ధికి చేస్తున్న నిరంతర కృషిపై సూళ్ళూరుపేట నియోజకవర్గ ప్రజలు తీవ్ర హర్షం వ్యక్తం చేస్తున్నారు

మ త ర న మ మలన కల ల న ఎమ మ ల య వ జయశ ర Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in