మూడు సినిమాలు.. మూడు స్ట్రాటజీలు
Actor ProfileActor

మూడు సినిమాలు.. మూడు స్ట్రాటజీలు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
మూడు సినిమాలు.. మూడు స్ట్రాటజీలు
Telugu Times26 Nov 2026
మూడు సినిమాలు.. మూడు స్ట్రాటజీలు

సూర్య ప్రకాష్ జోశ్యుల ఒకప్పుడు కొత్త సినిమా వస్తోందంటే నెల ముందు నుంచే ప్రిపరేషన్స్ మొదలయ్యేవి. అలాగే సినిమా కు వెళ్లాలి అనిపించటానికి కూడా పెద్దగా కారణాలు వెతికేవారు కాదు. హీరో నచ్చాడు. ట్రైలర్ బాగుంది. ఫ్రెండ్స్ వెళ్తున్నారు. అంతే… ఇలాంటి కారణాలు చాలు. టికెట్ బుక్ చేసుకునేవాళ్లు. కానీ ఇప్పుడు మాత్రం పరిస్థితి మారిపోయింది. “థియేటర్‌లోనే చూడాలా? కొంచెం ఆగితే OTTలో వస్తుందిగా…”, ఇది ఇప్పుడు చాలా మంది ప్రేక్షకుల మనసులో ముందుగా వచ్చే ఆలోచన. అందుకే ఒక సినిమాకు హిట్ టాక్ రావడం కంటే ముందు, అది ప్రేక్షకుడిని థియేటర్‌ని లాక్కు రావడానికి సరైన కారణం ఇవ్వగలగాలి. ఎందుకంటే కోవిడ్ తర్వాత ఈ మార్పు మరింత స్పష్టంగా కనిపిస్తోంది. ఇంట్లోనే కొత్త సినిమాలు చూసే అవకాశం పెరిగింది. టికెట్ ధరలు, పార్కింగ్, ఫుడ్ ఖర్చులు కలిపి థియేటర్‌కు వెళ్లడం ఒక చిన్న ఫ్యామిలీ ఈవెంట్‌గా మారింది. దాంతో ప్రేక్షకుడు కూడా తన ఎంపికలో మరింత సెలెక్టివ్ అయ్యాడు. “సినిమా బాగుంటుందా?” అనేది ఇప్పుడు ఒక్కటే ప్రశ్న కాదు. “ఈ సినిమాను థియేటర్‌లోనే ఎందుకు చూడాలి?” అనేదే అసలు ప్రశ్నగా మారింది. ఈ మారిన ప్రేక్షకుడి ముందుకు ఇప్పుడు మూడు వేర్వేరు సమాధానాలతో మూడు సినిమాలు వస్తున్నాయి. ఒకటి అంటోంది “నా కథ విను.” మరొకటి అంటోంది… “నా ఎమోషన్ ని ఫీల్ అవ్వు.” ఇంకొకటి చెబుతోంది… “నా విజువల్స్‌ను పెద్ద స్క్రీన్‌పై చూడు.”.మూడు సినిమలు మూడు విభిన్నమార్గాలు ఎంచుకున్నాయి. ఆ మూడు సినిమాలే విశ్వనాథ్ & సన్స్, ఇరుముడి, టాక్సిక్. ఈ మూడు సినిమాలు. మూడు వేర్వేరు ఫార్ములాలు. కానీ ప్రేక్షకుడి ప్రశ్న మాత్రం ఒక్కటే… “నా టికెట్ డబ్బుకు ఏ సినిమా నిజంగా న్యాయం చేస్తుంది?” అని. ఇదే ఇప్పుడు ఈ మూడు సినిమాల బాక్సాఫీస్ పోటీని ఆసక్తికరంగా మారుస్తున్న విషయం. ఓపెనింగ్ ఎవరిది? లాంగ్ రన్ ఎవరిది? ప్రస్తుతం

మ డ స న మ ల మ డ స ట ర టజ ల Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in