
తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో భక్తుల విశ్వాసం మరోసారి నిరూపితమైంది. ఆగస్టు 18 మంగళవారం నాడు ఒక్కరోజులోనే శ్రీవారి హుండీ ఆదాయం రూ.6.12 కోట్లు నమోదైందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. సరిగ్గా మూడు సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత హుండీ ఆదాయం రూ.6 కోట్ల మార్క్‌ను దాటడం విశేషంగా నిలిచింది. ఈ రోజున మొత్తం 80,905 మంది భక్తులు స్వామివారిని దర్శించుకుని తమ కానుకలను సమర్పించుకున్నారు. సాధారణ రోజుల్లో రోజువారీ హుండీ ఆదాయం రూ.3-4 కోట్ల మధ్య నమోదవుతుండగా, తీవ్ర రద్దీ ఉండే సమయాల్లో రూ.4-5 కోట్లు దాటుతుంది. అయితే రోజువారీ కలెక్షన్ రూ.6 కోట్లు దాటడం అత్యంత అరుదైన విషయంగా అధికారులు చెబుతున్నారు. గతంలో 2023 జనవరి 2న వైకుంఠ ఏకాదశి పర్వదినాన రూ.7.68 కోట్లు లభించగా, 2018 జూలై 27న రూ.6.28 కోట్లు మరియు 2022 జూలై 5న రూ.6.18 కోట్ల రికార్డు స్థాయి ఆదాయం లభించింది. ఈ రద్దీ ప్రభావంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని కంపార్ట్‌మెంట్లు అన్నీ పూర్తిగా నిండిపోయాయి. దీంతో టోకెన్లు లేని భక్తులు వెలుపలి క్యూ లైన్లలో గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోంది. ప్రస్తుతం స్వామివారి సర్వదర్శనానికి 20 గంటలకు పైగా సమయం పడుతున్నప్పటికీ భక్తుల రాక మాత్రం తగ్గడం లేదు. ఇదిలా ఉండగా ఆగస్టు నెలలో రోజువారీ దర్శనాలు 70,000 నుండి 90,000 మధ్య నమోదు అవుతుండగా, సాధారణ హుండీ ఆదాయం రూ.3.8 నుండి 4.8 కోట్ల వరకు ఉంటోంది. టీటీడీ చరిత్రలోనే అత్యధిక నెలవారీ హుండీ ఆదాయం 2026 జూలై నెలలో రూ.140.28 కోట్లతో చరిత్రాత్మక రికార్డు సృష్టించింది. ఆ నెలలో ఏకంగా 24.52 లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకోవడం విశేషం. ఈ నేపథ్యంలో 2026 సంవత్సరం మొదటి ఏడు నెలల్లో అంటే జనవరి నుండి జూలై వరకు శ్రీవారి హుండీ మొత్తం ఆదాయం ఏకంగా రూ.861 కోట్లకు