మెడికో ప్రియాంక కేసు.. తప్పుడు ప్రచారాలను నమ్మొద్దన్న రాజమండ్రి ఎమ్మెల్యే
Actor ProfilePolitician

మెడికో ప్రియాంక కేసు.. తప్పుడు ప్రచారాలను నమ్మొద్దన్న రాజమండ్రి ఎమ్మెల్యే

📊 Box Office Collections
Total News3
Movie Updates0
Sources1
మెడికో ప్రియాంక కేసు.. తప్పుడు ప్రచారాలను నమ్మొద్దన్న రాజమండ్రి ఎమ్మెల్యే
Andhra Jyothy25 Nov 2026
మెడికో ప్రియాంక కేసు.. తప్పుడు ప్రచారాలను నమ్మొద్దన్న రాజమండ్రి ఎమ్మెల్యే

మెడికో విద్యార్థిని ప్రియాంక కేసుపై రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ స్పందించారు. రాజమండ్రి ఘటనపై ఎలాంటి ఒత్తిళ్లకు తావులేకుండా 3 గంటల్లోనే ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు తెలిపారు. హైదరాబాద్, ఆగస్టు 10: మెడికో విద్యార్థిని ప్రియాంక కేసుపై రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ స్పందించారు. రాజమండ్రి ఘటనపై ఎలాంటి ఒత్తిళ్లకు తావులేకుండా 3 గంటల్లోనే ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు తెలిపారు. ఈరోజు(సోమవారం) గాంధీ ఆస్పత్రికి చేరుకున్న ఎమ్మెల్యే.. ప్రియాంక కుటుంబసభ్యులను ఓదార్చారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఈ కేసులో అలసత్వానికి తావులేదని.. లోతైన విచారణ పూర్తి చేసినట్లు చెప్పారు. ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి లోకేశ్ ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారన్నారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే ఇద్దరు నిందితులను రిమాండ్‌కు తరించామని, ఎంతటి వారైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. అమ్మాయిని వ్యక్తిత్వ హననం చేస్తూ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవద్దని హితవుపలికారు. సోషల్ మీడియాలో వస్తోన్న అపోహలు, తప్పుడు ప్రచారాలను ఎవరూ నమ్మవద్దన్నారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలుస్తుందని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు. మరోవైపు హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో.. ప్రియాంక మృతదేహానికి పోస్టుమార్టం పూర్తైంది. దీంతో గద్వాల్ జిల్లా అయిజా మండలం ఏక్లాస్‌పూర్‌కు ప్రియాంక డెడ్‌బాడీని కుటుంబసభ్యులు తరలించారు. తెలంగాణ మంత్రి వాకిటి శ్రీహరి, రాజమండ్రి అర్బన్ ఎమ్మెల్యే శ్రీనివాస్ గాంధీ ఆస్పత్రికి చేరుకుని.. ప్రియాంక తండ్రిని ఓదార్చారు. ప్రియాంక మృతదేహం వెంట ఏక్లాస్‌పూర్‌ గ్రామానికి రాజమండ్రి టీడీపీ అధ్యక్షుడు వెంకట రమణా చౌదరి వెళ్లనున్నారు. అలాగే ఏపీ మంత్రి టీజీ భరత్.. ప్రియాంక స్వగ్రామానికి వెళ్లనున్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన రూ.20 లక్షల చెక్‌ను ప్రియాంక తండ్రికి మంత్రి అందజేయనున్నారు. రోడ్డు ప్రమాదంలో ట్రాఫిక్ డీసీపీ కుమార్తె మృతిపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి టీడీపీ, వైసీపీ పోటాపోటీ కార్యక్రమాలు.. తాడిపత్రిలో హైటెన్షన్

యూపీ గ్యాంగ్ స్టర్ అతీక్ అహ్మద్ కొడుకు అనుచరుల హల్ చల్.. 28 మందిపై కేసులు
Andhra Jyothy25 Nov 2026
యూపీ గ్యాంగ్ స్టర్ అతీక్ అహ్మద్ కొడుకు అనుచరుల హల్ చల్.. 28 మందిపై కేసులు

ఉత్తర్‌ప్రదేశ్ మాజీ ఎంపీ, గ్యాంగ్‌స్టర్ అతీక్ అహ్మద్ కుమారుడు ఉమర్ అహ్మద్ అనుచరులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. నావాబ్‌గంజ్ టోల్ సిబ్బంది ఇచ్చిన ఫిర్యాదుతో ప్రయాగ్‌రాజ్ పోలీసులు 28 మందిపై కేసులు

మనిషికి ఆధార్’ లాగే.. భూములకు కూడా భూధార్
Andhra Jyothy25 Nov 2026
మనిషికి ఆధార్’ లాగే.. భూములకు కూడా భూధార్

తెలంగాణ వ్యాప్తంగా గత పాలకులు ఆర్భాటంగా అనేక డివిజన్లు, జిల్లాలు, మండలాలు ఏర్పాటు చేశారని.. ఎక్కడ కూడా ఆఫీసులు, ఇతరత్రా సౌకర్యాలు ఏర్పాటు చేయలేదని విమర్శించారు. హనుమకొండ, ఆగస్టు 10: జిల్లాలోని