మూడు ఓటీటీల్లో దూసుకుపోతున్న త్రికాల
Actor ProfileActor

మూడు ఓటీటీల్లో దూసుకుపోతున్న త్రికాల

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
మూడు ఓటీటీల్లో దూసుకుపోతున్న త్రికాల
Chitrajyothy30 Oct 2026
మూడు ఓటీటీల్లో దూసుకుపోతున్న త్రికాల

ఇటీవ‌ల డిజిట‌ల్ స్ట్రీమింగ్‌కు వ‌చ్చిన త్రికాల మూవీ మూడు ఓటీటీల‌లో స్ట్రీమింగ్ అవుతూ మంచి వ్యూస్ రాబ‌డుతోంది. భారతీయ ఆధ్యాత్మిక రహస్యాలను ఆధారంగా చేసుకుని రూపొందిన మైథలాజికల్ ఫిక్షనల్ థ్రిల్లర్ మూవీ ‘త్రికాల’ (Trikala). మేలో థియేట‌ర్ల‌కు వ‌చ్చిన ఈ సినిమా మంచి టాక్ తెచ్చుకుంది. ప్రముఖ నటి శ్రద్ధాదాస్ ప్రధాన పాత్రలో నటించిన‌ ఈ చిత్రం థ్రిల్లింగ్ అంశాలు, ఆధ్యాత్మిక నేపథ్యం, గ్రాండ్ విజువల్స్ కలయికగా రూపొందింది. దర్శకుడు మణి తెల్లగూటి తెరకెక్కించిన ఈ చిత్రంలో మాస్టర్ మహేంద్రన్, అజయ్, ఆమని కీలక పాత్రలు పోషించారు. రాధిక–శ్రీనివాస్ నిర్మించిన ఈ చిత్రం ఇప్పుడు మూడు ఓటీటీల‌లో స్ట్రీమింగ్ అవుతూ మంచి వ్యూస్ తో దూసుకుపోతోంది. ‘A Script of God’ అనే ఆసక్తికరమైన సబ్‌టైటిల్‌తో వచ్చిన ఈ ‘త్రికాల’ సినిమా థియేటర్లలో మంచి స్పంద‌న అందుకుని ఇప్పుడు ఓటీటీ వేదికలపై సైతం సంచలనం సృష్టిస్తోంది. ప్రస్తుతం జియో హాట్‌స్టార్, అమెజాన్ ప్రైమ్, సన్‌నెక్ట్స్ వంటి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో స్ట్రీమింగ్ అవుతూ టాప్ రేటింగ్‌తో ట్రెండ్ అవుతోంది. ఐఎండీబీ (imdb)లోనూ 9.1 రేటింగ్ అందుకుని హాట్ టాపిక్‌గా నిలుస్తోంది

మ డ ఓట ట ల ల ద స క ప త న న త ర క ల Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in