మాజీ మంత్రి హరీష్ రావు హౌస్ అరెస్ట్.. కోకాపేట్ వద్ద హైటెన్షన్.. భారీగా చేరుకున్న పోలీసులు
Actor ProfilePolitician

మాజీ మంత్రి హరీష్ రావు హౌస్ అరెస్ట్.. కోకాపేట్ వద్ద హైటెన్షన్.. భారీగా చేరుకున్న పోలీసులు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
మాజీ మంత్రి హరీష్ రావు హౌస్ అరెస్ట్.. కోకాపేట్ వద్ద హైటెన్షన్.. భారీగా చేరుకున్న పోలీసులు
Zee Telugu15 Jan 2027
మాజీ మంత్రి హరీష్ రావు హౌస్ అరెస్ట్.. కోకాపేట్ వద్ద హైటెన్షన్.. భారీగా చేరుకున్న పోలీసులు

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Harish rao and talasani Srinivas yadav arrested: తెలంగాణలో మరోసారి బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ ల మధ్య రాజకీయాలు పీక్స్ కు చేరాయి. ఈ నేపథ్యంలో సనత్ నగర్ లో ఉన్న టిమ్స్ సదుపాయాల కల్పన విషయంలో బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ పై తీవ్రమైన ఆరోపణలు చేశారు. అయితే.. మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు, బీఆర్ఎస్ నేతలు సనత్ నగర్ టిమ్స్ ను సందర్శించడానికి బయలు దేరారు. ఈ క్రమంలో భారీగా పోలీసులు మాజీ మంత్రి నివాసం వద్దకు చేరుకున్నారు. హరీష్ రావును ఇంటి నుంచి బైటకు రానివ్వకుండా పోలీసులు అడ్డుకున్నారు. కానీ హరీష్ రావు పోలీసులున్ని పక్కకు తోసి మరీ తన వాహంలో ఎక్కి కూర్చున్నారు. పోలీసులు హరీష్ వాహనాన్ని అడ్డగించారు. ఈ నేపథ్యంలో భారీగా బీఆర్ఎస్ కార్యకర్తలు అక్కడకు చేరుకొవడంతో తోపులాట చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో మాజీ హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. హరీష్ రావు గారు, తలసాని శ్రీనివాస్ గారు సహా మేమందరం టీమ్స్ సనత్ నగర్ వెళ్తుంటే పోలీసులను పెట్టి అడ్డుకోవడం సిగ్గుచేటన్నారు. టీమ్స్ ఆసుపత్రులను కనీస మౌలిక వసతులు కూడా పూర్తిగా కల్పించకుండానే, అరకొర వసతులతో గుడ్డిగా ప్రారంభించారని ఎద్దేవా చేశారు. తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం వైద్యరంగానికి పెద్దపీట వేసిందని, 34 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేసిందన్నారు. కేసీఆర్ ముందుచూపుతో నాలుగు టీమ్స్ ఆసుపత్రుల నిర్మాణానికి శ్రీకారం చుట్టారని గుర్తు చేశారు. రాబోయే రోజుల్లో 10 వేల పడకలను అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో కేసీఆర్ ప్రభుత్వం టీమ్స్ ఆసుపత్రులకు