మాజీ మంత్రి అనుచరుల భూ దందా.. చంపేస్తామంటూ బెదిరింపులు
Actor ProfilePolitician

మాజీ మంత్రి అనుచరుల భూ దందా.. చంపేస్తామంటూ బెదిరింపులు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
మాజీ మంత్రి అనుచరుల భూ దందా.. చంపేస్తామంటూ బెదిరింపులు
TeluguOne8 Dec 2026
మాజీ మంత్రి అనుచరుల భూ దందా.. చంపేస్తామంటూ బెదిరింపులు

చంపేస్తే బెయిల్ వస్తుంది.. వైసీపీ నేత వీడియో వైరల్..! కాకినాడ జిల్లాలో అధికార మార్పిడి జరిగినప్పటికీ భూ ఆక్రమణలు, బెదిరింపుల పర్వం కొనసాగుతోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వైసీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి దాడిశెట్టి రాజా అనుచరులు ఓ భూ వివాదంలో ఏకంగా మాజీ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడిని, ప్రముఖ వైద్యుడిని హత్య చేస్తామంటూ తీవ్ర బెదిరింపులకు దిగడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. బాధితుడి కథనం ప్రకారం.. తునికి చెందిన ప్రముఖ వైద్యుడు, జిల్లా కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు డాక్టర్ చిలుకోటి పాండురంగారావు కుటుంబానికి తొండంగి మండలంలో 3.53 ఎకరాల భూమి ఉంది. ఆయన మామ సుమారు 17 ఏళ్ల క్రితం పెద్దిరెడ్డి కొండలరావు నుంచి ఈ స్థలాన్ని చట్టబద్ధంగా కొనుగోలు చేశారు. అయితే, ఆ భూమిపై కన్నువేసిన కొండలరావు కుమారుడు, వైసీపీ నేత పెద్దిరెడ్డి సురేష్ పదేళ్ల తర్వాత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ స్థలం వివాదంపై విచారణ జరిపిన పిఠాపురం న్యాయస్థానం ఈ ఏడాది జనవరిలో సురేష్ పిటిషన్‌ను కొట్టివేస్తూ, భూమి హక్కులు డాక్టర్ పాండురంగారావు కుటుంబానివేనని స్పష్టం చేసింది. కోర్టు తీర్పు అనంతరం బాధితులు తమ స్థలంలో పనులు ప్రారంభించేందుకు ప్రతినిధులను పంపగా, మాజీ సర్పంచ్ సురేష్ అనుచరుడు దేవులపల్లి శ్రీనుతో పాటు మరో ఎనిమిది మంది దౌర్జన్యానికి దిగారు. బాధితుల ప్రతినిధులను అడ్డుకున్న దేవులపల్లి శ్రీను, డాక్టర్‌ను లేపేస్తామని, హత్య చేసినా తమకు మూడేళ్లకు మించి జైలు శిక్ష పడదని అత్యంత నిర్లక్ష్యంగా వ్యాఖ్యానించారు. తనకు 40 ఏళ్లుగా కేసులతో అనుభవం ఉందని, సులభంగా బెయిల్ తెచ్చుకుంటామని బెదిరించారు. ఈ దౌర్జన్యానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ కావడంతో రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. ఈ ఘటనపై బాధితులు గత నెలలోనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పాటు వీడియో ఆధారాలను పెన్‌డ్రైవ్ ద్వారా అందించినప్పటికీ, అధికారులు వెంటనే చర్యలు తీసుకోలేదనే విమర్శలు

మ జ మ త ర అన చర ల భ ద ద చ ప స త మ ట బ ద ర ప ల Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in