మాజీ ప్రధాని వాజ్ పేయికి మంత్రి నారా లోకేశ్ ఘన నివాళి
Actor ProfilePolitician

మాజీ ప్రధాని వాజ్ పేయికి మంత్రి నారా లోకేశ్ ఘన నివాళి

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
మాజీ ప్రధాని వాజ్ పేయికి మంత్రి నారా లోకేశ్ ఘన నివాళి
AP7AM28 Dec 2026
మాజీ ప్రధాని వాజ్ పేయికి మంత్రి నారా లోకేశ్ ఘన నివాళి

భారత మాజీ ప్రధాని, భారతరత్న అటల్ బిహారీ వాజ్‌పేయి వర్థంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఆయనకు ఘన నివాళులు అర్పించారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా వేదికగా ఒక ప్రత్యేక పోస్ట్ చేశారు. వాజ్‌పేయి దేశానికి అందించిన సేవలను స్మరించుకుంటూ ఆ మహనీయుని స్మృతికి నివాళులు అర్పిస్తున్నట్లు తెలిపారు.ఈ సందర్భంగా లోకేశ్ తన పోస్టులో వాజ్‌పేయి సేవలను కొనియాడారు. "భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి గారి వర్థంతి సందర్భంగా ఆ మహనీయుని స్మృతికి ఘననివాళులు అర్పిస్తున్నాను. దేశం ఆర్థికంగా, సాంకేతికంగా, రక్షణపరంగా అభివృద్ధి చెందడంలో వాజ్ పేయి కీలకపాత్ర పోషించారు. దేశ రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేకస్థానం సంపాదించుకున్నారు. భారతరత్న వాజ్ పేయి గారి వర్థంతి సందర్భంగా దేశానికి వారు అందించిన సేవలను స్మరించుకుందాం" అని లోకేశ్ పేర్కొన్నారు.భారత రాజకీయాల్లో సౌమ్యుడిగా, గొప్ప వక్తగా పేరుగాంచిన వాజ్‌పేయి, దేశ ప్రగతికి వేసిన బాటలను ఈ తరం గుర్తుంచుకోవాలని ఆయన తన సందేశం ద్వారా పిలుపునిచ్చారు

మ జ ప రధ న వ జ ప య క మ త ర న ర ల క శ ఘన న వ ళ Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in