మంచి సినిమా ఇస్తే ఆడియెన్స్ ఎప్పుడూ సపోర్ట్ చేస్తారు.. లెనిన్’ సక్సెస్ మీట్ లో నిర్మాత కింగ్ నాగార్జున
Actor ProfileActor

మంచి సినిమా ఇస్తే ఆడియెన్స్ ఎప్పుడూ సపోర్ట్ చేస్తారు.. లెనిన్’ సక్సెస్ మీట్ లో నిర్మాత కింగ్ నాగార్జున

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
మంచి సినిమా ఇస్తే ఆడియెన్స్ ఎప్పుడూ సపోర్ట్ చేస్తారు.. లెనిన్’ సక్సెస్ మీట్ లో నిర్మాత కింగ్ నాగార్జున
Telugu Times30 Oct 2026
మంచి సినిమా ఇస్తే ఆడియెన్స్ ఎప్పుడూ సపోర్ట్ చేస్తారు.. లెనిన్’ సక్సెస్ మీట్ లో నిర్మాత కింగ్ నాగార్జున

‘లెనిన్’ను ఆదరిస్తోన్న తెలుగు ప్రేక్షకులకు థాంక్స్.. సక్సెస్ మీట్‌లో అఖిల్ అక్కినేని అఖిల్ హిట్టు కొట్టాడు అని అందరూ అంటుంటే ఆనందంగా ఉంది.. ‘లెనిన్’ సక్సెస్ మీట్‌లో నిర్మాత సూర్య దేవర నాగవంశీ అఖిల్ అక్కినేని హీరోగా అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్ఎల్‌పి, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగ వంశీ నిర్మించిన చిత్రం ‘లెనిన్’. భాగ్యశ్రీ బోర్సే కథానాయిక. మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వం వహించారు. ఈ మూవీ జూలై 10న గ్రాండ్‌గా విడుదలై బ్లాక్ బస్టర్ టాక్‌తో సక్సెస్ ఫుల్‌గా దూసుకుపోతోంది. ఈ క్రమంలో శనివారం చిత్ర యూనిట్ విజయోత్సవ వేడుకను నిర్వహించింది. ఈ సక్సెస్ మీట్‌లో నిర్మాత కింగ్ నాగార్జున మాట్లాడుతూ ‘‘అన్నమయ్య’ చేశాక నేను దేవుడ్ని ఏదీ అడిగింది లేదు. కానీ తిరుపతిలో ఈవెంట్ అయ్యాక.. స్వామిని దర్శించుకున్నప్పుడు మాత్రం మా వాడికి ఓ హిట్టు ఇవ్వండని అడిగాను. భాగ్యశ్రీ కూడా అదే కోరుకుందని తర్వాత నాకు తెలిసింది. ముందుగా ఆ వెంకటేశ్వరస్వామికి కృతజ్ఞతలు. ‘లెనిన్’కి వాయిస్ ఇచ్చిన నా పెద్ద అబ్బాయి తారక్‌కి థాంక్స్. ఏడాదిన్నర క్రితం ‘తండేల్’ సక్సెస్ మీట్‌కి వచ్చాం. ఇప్పుడు ఇలా ‘లెనిన్’ సక్సెస్‌కి వచ్చాను. ఇద్దరూ నా రెండు కళ్లలాంటి వాళ్లు. ‘లెనిన్’ టీంని చూస్తే అసూయగా ఉంది. అందరూ ఎంతో ఇష్టపడి కష్టపడి చేశారు. ‘శివ’, ‘నిన్నే పెళ్లాడుతా’, ‘అన్నమయ్య’ సినిమాలు కూడా ఇలానే అందరం కలిసి చేశాం. ఈ మధ్య నాకు మళ్లీ ఇలాంటి అనుభవం కలగడం లేదు. ‘లెనిన్’కి పని చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. ఈ జర్నీలో నందుని, నాగవంశీని, ఎడిటర్ నవీన్‌ని ఎక్కువగా కలిశాను. నందు, నవీన్ ఇద్దరూ సైకోలే (నవ్వుతూ). సినిమా పట్ల ఆ ఇద్దరికీ ఎక్కడా లేని పిచ్చి ఉంటుంది. నేను ఎన్ని సలహాలు, ఇన్ పుట్స్ ఇచ్చినా అర్థం చేసుకున్నారు. ఎన్నో వర్షెన్స్‌ రాశారు